ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GANESH : ఘనంగా గణేశ నిమజ్జనం

ABN, Publish Date - Sep 12 , 2024 | 12:27 AM

వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలో విగ్రహాల నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరిగిం ది. ఈ సందర్భంగా మండపాల వద్ద గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి సీబీరోడ్డు, యల్లనూరురోడ్డు, పుట్లూరురోడ్డు, మెయినబజారు, గాంధీకట్ట మీదుగా ఊరేగించారు. దాదాపు 200 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు.

MLA Ashmita Reddy offering aarti to Vinayaka in Tadipatri

తాడిపత్రి, సెప్టెంబరు 11: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలో విగ్రహాల నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరిగిం ది. ఈ సందర్భంగా మండపాల వద్ద గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి సీబీరోడ్డు, యల్లనూరురోడ్డు, పుట్లూరురోడ్డు, మెయినబజారు, గాంధీకట్ట మీదుగా ఊరేగించారు. దాదాపు 200 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. మండలంలోని యర్రగుంటపల్లి, ఆలూరు, తేరన్నపల్లి, బొందలదిన్నె, పెద్దపప్పూరు మండలంలోని చీమలవాగుపల్లి సరిహద్దులో ఉన్న వంకలు, వాగులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్ర మాన్ని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నిమ జ్జన ఊరేగింపు కార్యక్రమం దాదాపు 3గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 10గంటలకు విగ్రహాలను ఊరేగింపుగా తీసుకురావాల్సి ఉండగా మధ్యాహ్నం ఒంటి గంట అయినా చేరుకోకపోవడం గమనార్హం. పోలీసు లు మండపాల నిర్వాహకులకు సరైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడమే కారణం అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అపశ్రుతి : విద్యుత వైర్లు తగిలి పట్టణంలోని యల్లనూరురోడ్డులో వ స్తున్న భారీ వినాయక విగ్రహం తలభాగం కిందపడింది. ఒకరికి స్వల్ప గా యాలయ్యాయి. వెనుకవైపు జనాలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిం ది. నిర్వాహకులు విగ్రహాన్ని మరో ట్రాక్టర్‌లో నిమజ్జనానికి తరలించారు.


ఉరవకొండ: గణేష్‌ నిమజ్జన కార్యక్రమాన్ని ఉరవకొండ పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. వివిధ మండపాలలో కొలువు దీరిన విగ్రహాలను విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి హంద్రీనీవా కాలువ, హెచ్చెల్సీలో నిమజ్జనం చేశారు. సీఐ సురేష్‌బాబు పర్యవే క్షించారు. అలాగే పట్టణంలోని 10వవార్డులో కాణిపాక వరసిద్ది వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయకుడి చేతిలోని లడ్డుకు మంగళవారం రాత్రి వే లం పాట నిర్వహించారు. బాబు అనే భక్తుడు రూ.72వేలకు దక్కించుకు న్నారు. వెండిగొలుసును పెద్దకోట్ల మురళి రూ.25వేలకు, వెండి కడియాన్ని ప్రతాప్‌ 13వేలకు, శాలువాను జంగం రాజా రూ.12 వేలకు, ౅ కండువాను పద్దకోట్ల వన్నూరుస్వామి రూ.8వేలుకు దక్కించుకున్నారు.

కణేకల్లు: మండల వ్యాప్తంగా బుధవారం వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని చిక ్కణ్ణేశ్వర ఆలయం వద్ద ప్రతిష్ఠించిన విగ్రహాన్ని ట్రాక్టర్‌లో ఉంచి ఊరేగించి నిమజ్జనానికి తీసుకెళ్లా రు. ఆలయ కమిటీ సభ్యులు వీరేష్‌, లోకేష్‌, మంజునాథ్‌, చంద్రశేఖర్‌గుప్త, వేలూరు మరియప్ప, బీటీ రమేష్‌, కురుబ నాగరాజు, అనిల్‌, చంద్ర, నాగు, గామేష్‌తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 12 , 2024 | 12:27 AM

Advertising
Advertising