ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

WOMENS WORRY : దప్పిక తీర్చుకోడమూ తప్పేనా..?

ABN, Publish Date - May 02 , 2024 | 12:17 AM

సీఐ రాజశేఖర్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ తంబళ్లపల్లి ఎస్సీ కాలనీ మహిళలు పామిడి పోలీస్‌ స్టేషన ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్సీ కాలనీలో ఆరు నెలలుగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని, పంచాయతీ సర్పంచు, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేక తాము స్వయంగా పైపులైను ఏర్పాటు చేసుకునేందుకు చందాలు వేసుకుని పనులు ప్రారంభించామని, ఆ క్రమంలో సత్యసాయిబాబా ..

Argument with CI

పామిడి పీఎస్‌ వద్ద మహిళల ఆందోళన

సీఐ దురుసుగా ప్రవర్తించారని

ఆగ్రహంపామిడి పీఎస్‌ వద్ద మహిళల ఆందోళన

సీఐ దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం

పామిడి, మే 1: సీఐ రాజశేఖర్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ తంబళ్లపల్లి ఎస్సీ కాలనీ మహిళలు పామిడి పోలీస్‌ స్టేషన ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్సీ కాలనీలో ఆరు నెలలుగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని, పంచాయతీ సర్పంచు, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేక తాము స్వయంగా పైపులైను ఏర్పాటు చేసుకునేందుకు చందాలు వేసుకుని పనులు ప్రారంభించామని, ఆ క్రమంలో సత్యసాయిబాబా వాటర్‌ పైపు పగిలిపోయిందని తెలిపారు. దీనిపై నీలూరు పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి.. పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. విచారించేందుకు వచ్చిన సీఐ రాజశేఖర్‌రెడ్డి తమపట్ల దురుసుగా ప్రవర్తించారని మహిళలు ఆవేదన


వ్యక్తంచేశారు. పైపులైన ఏర్పాటుకు ఉపయోగించిన ఎక్స్‌కవేటర్‌ను స్టేషనకు తరలించారని, కాలనీవాసులను సైతం స్టేషనకు తీసుకువెళ్లారని తెలిపారు. తాగునీటి సమస్యను అధికారులు పరిష్కరించలేదని, తమ సమస్యను తాము పరిష్కరించుకుంటున్నా పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మిమ్మల్ని జైలుకు పంపితీరుతా.. లేకపోతే నా పేరు రాజశేఖర్‌రెడ్డే కాదు’ అని బెదిరించారని ఆరోపించారు. కాలనీవాసులను వదిలిపెట్టాని పట్టుబట్టారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు సీఐని నిలదీశారు. తాగునీటి కోసం స్వచ్ఛందంగా ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్న పైపులైనపై రాజకీయం చేయడం తగదని అన్నారు. ఆందోళన ఉధృతం అవుతుందేమోనని భావించిన గుత్తి సీఐ వెంకటరామిరెడ్డి తన సిబ్బందితో పామిడి పోలీసు స్టేషనకు వచ్చి చర్చించ్చారు. రాత్రి పది గంటల సమయంలో కాలనీవాసులను సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 02 , 2024 | 12:17 AM

Advertising
Advertising