ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Banner story : ఎటుపోతోంది సమాజం?

ABN, Publish Date - Aug 04 , 2024 | 11:33 PM

ఎటుపోతోంది సమాజం? ఉచ్చ, నీచాలు, వావివరుసలు లేని పాతరాతి యుగంలా రగులుతోందా? ఆదిశక్తిని కొలిచే ఈ సమాజమే ఆడబిడ్డను ఆటబొమ్మగా చూస్తోందా? బేటీ అంటే ఇంటికి బ్యూటీ అంటారు కదా..! మరి ఆ అందాన్ని ఆరాధిస్తున్నారా లేక అంతులేని కామ వాంఛతో చిదిమేస్తున్నారా? భగవంతుడిచ్చిన అవయవముంటే చాలు పడుచు పిల్ల , పండు ముసలి అన్న తేడా లేదు. పాలుగారే పసిపాప అయినా పర్వాలేదు. ...

పసి పిల్లలపై లైంగిక దాడులు

బంగారు బాల్యాన్ని చిదిమేస్తున్న దుండగులు

ఇంటా, బయట పెరిగిన అఘాయిత్యాలు

వావి వరుసలు మరిచి దారుణాలు

బాలికలపై పెరిగిన అత్యాచారాలు, హత్యాచారాలు

కఠిన చట్టాలు తెచ్చినా....కానరాని మార్పు

దురాగతాలకు అంతం ఎప్పుడో...?

ఎటుపోతోంది సమాజం? ఉచ్చ, నీచాలు, వావివరుసలు లేని పాతరాతి యుగంలా రగులుతోందా? ఆదిశక్తిని కొలిచే ఈ సమాజమే ఆడబిడ్డను ఆటబొమ్మగా చూస్తోందా? బేటీ అంటే ఇంటికి బ్యూటీ అంటారు కదా..! మరి ఆ అందాన్ని ఆరాధిస్తున్నారా లేక అంతులేని కామ వాంఛతో చిదిమేస్తున్నారా? భగవంతుడిచ్చిన అవయవముంటే చాలు పడుచు పిల్ల , పండు ముసలి అన్న తేడా లేదు. పాలుగారే పసిపాప అయినా పర్వాలేదు. అంతులేని ‘కోరిక’తో అకృత్యాలకు తెగబడుతున్నారు. మగ పుట్టుక పుడితే చాలు... ఆడేపాడే వయసు నుంచి కాటికి కాలు చాచే వయసులో కూడా కోరికలతో కాటేస్తున్నారు. ఎక్కడుంది లోపం? ఇంటిలోనా? సమాజంలోనా లేక పాఠాలు చెప్పే బడిలోనా? ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు అంతం ఎప్పుడో?

అనంతపురం విద్య, ఆగస్టు 4: ఇటీవల కాలంలో పసిపాపలపై లైంగికదాడులు పెరిగాయి. బడిలో.. ఆట స్థలాల్లో, అంగడికెళ్లే చోట ఇలా ఏదో ఒక చోట అమ్మాయిలపై లైంగిక దాడులు నిత్యకృత్యంగా మారాయి. ఒక చోట అన్న, మరో చోట నాన్న, ఇంకో చోట...చిన్నాన్న, మరో చోటు హితుడు, ఇంకో దగ్గర స్నేహితుడు.... ఇలా ప్రతి చోట పాత్ర మారుతోందే కానీ.... మనిషి మాత్రం ‘అతడే’. అతడి నుంచి నుంచి వేధింపులు మాత్రం ఆగడం లేదు. తియ్యని మాటలు వినిపిస్తాయి. కమ్మని ప్రేమ కనిపిస్తుంది. కానీ సమయం వచ్చినడప్పుడు చీకటిలో దాడులు చేసి బాలికల వెలుగును చిదిమేస్తున్నారు. ఒక ప్రాంతంలో 12 ఏళ్ల బాలుడు, ఇంకో ప్రాంతంలో పాతికేళ్ల యువకుడు, ఇంకో చోట నలబై ఏళ్ల నడి వయస్కుడు, మరోచోట 60 ఏళ్లు దాటిన వృద్ధుడు....ఇలా...అన్నిటా...వయస్సు మారుతోంది కానీ... వేధింపులు ఆగడం లేదు.


బంగారు బాల్యంపై విషం

పాలుగారే పసి ప్రాయాన్ని కొన్ని చీడ పురుగులు చిదిమేస్తున్నాయి. బంగారు బాల్యాన్ని చేదు జ్ఞాపకంగా మిగులుస్తున్నారు. చాలా చోట్ల పిల్లలపై లైంగికంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. పిల్లలు దేనికైనా త్వరగా ఆకర్షితులు అవుతారు. అది చెడు చేస్తుందా...? మంచి చేస్తుందా..? అని ఆలోచించే జ్ఞానం వారికి తక్కువగా ఉంటుంది. ఇదే మృగాళ్లకు అవకాశంగా మారుతోంది. చాలామంది తినుబండారాలు ఇవ్వడం, ఆట వస్తువులు ఇవ్వడం, లేదా కొనిస్తాని బయటకు తీసుకెళ్లడం వంటివి చేస్తూ....లైంగిక దాడులకు దిగుతున్నారు. ఈ విషయంలో మనవాళ్లా...పక్క వాళ్ల పిల్లలా అన్న విచక్షణ కూడా మరచి...రాక్షస మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు పిల్లల జీవితంపై తీరని గాయాన్ని చేస్తున్నాయి.

పిల్లల రక్షణకే పోక్సో చట్టం....

లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టాన్ని తీసుకొచ్చింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పీఓసీఎ్‌సఓ-2012)ను 2012 మే 22న భారత పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. అదే ఏడాది నవంబరు 14 నుంచి పోక్సో యాక్ట్‌ను భారత దేశంలో అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టం రాక ముందు.... గోవా చిల్డ్రన యాక్ట్‌ 2003 అనేది తీసుకొచ్చారు. పిల్లలపై లైంగిక వేధింపుల నియంత్రణ తీసుకొచ్చిన మొదటి చట్టం. అదేవిధంగా ఐపీసీ 1860లోని పలు సెక్షన్లు సైతం ఈ తరహా నేరాల నియంత్రణకు దోహదపడుతున్నాయి. ముఖ్యంగా ఐపీసీ 1860లోని సెక్షన 375 అత్యాచారం, ఐపీసీ 377 అసహజ నేరం, సెక్షన 354 దౌర్జన్యం, మహిళల అణకువకు భంగం కలిగించడం వంటి సెక్షన్లు ఉన్నా...పిల్లలను అలాంటి దాడుల నుంచి రక్షించలేకపోయాని గుర్తించారు. తర్వాత దీనిపై దేశ్యాప్తంగా సమగ్రమైన చట్టాన్ని తేవాలని ప్రభుత్వం గుర్తించింది 2012లో పోక్సో చట్టాన్ని తీసుకొచ్చారు. పిల్లలను శారీరకంగా, మానసికంగా వేధిస్తే నిందితులపై ఈ కేసు నమోదు చేస్తారు. 18 ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన శిక్షలతోపాటు మరణశిక్ష కూడా విఽధించే అవకాశం ఉంది. కొందరికి ఈ చట్టం తీవ్రత తెలియడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

గత ఐదేళ్లలో 718 కేసులు...

అనంతపురం జిల్లా వ్యాప్తంగా గత ఐదేళ్లలో 718 పోక్సో కేసులు నమోదయ్యాయి. బాలబాలికలపై జిల్లాలో మృగాళ్లు లైంగిక దాడులకు, వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో భారీగా పోక్సో కేసులు నమోదైనట్లు ఐసీడీఎస్‌ అధికారులు చెబుతున్నారు. 2019లో 84 కేసులు, 2020 ఏడాదిలో 150 కేసులు, 2021లో 167 కేసులు, 2022లో 144 కేసులు, 2023లో 132 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 41 కేసులు నమోదయ్యాయి. ఐసీడీఎస్‌, చైల్డ్‌ లైన అధికారులు పలు రకాలుగా ఈ లైంగిక వేధింపుల నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్నా..మార్పు రావడం లేదు. దీంతో ఎక్కడో....ఒక చోట....ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. చిన్నారుల బాల్యాన్ని దెబ్బతీస్తూనే ఉన్నాయి.

నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ తేలేరా..!

జిల్లాలో ఐసీడీఎస్‌, డీసీపీఓ, చైల్డ్‌ లైన వంటి విభాగాలున్నా ఈ నేరాలను అరికట్టడంలో ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. బాల్యంలో పసి మనసులు గాయ పడితే...దానిని మాన్పడం ఎవరి తరం కాదు. అందుకే నేరాలు జరక్కుండా చూడాల్సిన బాధత్య ఉంది. జిల్లాలో కలెక్టర్‌, ఎస్పీ వంటి ఉన్నతాధికారులతోపాటు చట్టాలు చేసే....శాసనసభ్యులు, పార్లమెంట్‌ సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర మేధావులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఇలా ఎందరో ఉన్నారు. వీరంతా సమష్టిగా లైంగిక నేరాల నియంత్రణకు నిరంతరం పర్యవేక్షణ చేసే ఒకవ్యవస్థను తేవాల్సిన బాధ్యత ఉంది. ఆ దిశగా జిల్లా యంత్రాంగం...పాలకులు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. భావితరాల బాల్యానికి భద్రత కల్పించాల్సిన అవసరం, బాధ్యత కూడా ఉంది.

తల్లిదండ్రులు కూడా అవగాహన కల్పించాలి

లైంగిక దాడుల నియంత్రణకు ఐసీడీఎస్‌ ఎంతగానో కృషి చేస్తోంది. ఐసీడీఎస్‌, చైల్డ్‌లైన ఇతర లైన డిపార్టుమెంట్స్‌తో కలిసి పిల్లల ఇబ్బందులను గుర్తించి కాల్స్‌ వచ్చిన వెంటనే వెళ్లి రెస్క్యూ చేసి సంరక్షిస్తున్నాం. స్కూళ్లు, కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. స్కూళ్లలో మానిటరింగ్‌ కమిటీలు కూడా ఏర్పాటు చేయిస్తున్నాం. ముఖ్యంగా ఇంట్లో పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి.

- శ్రీదేవి, ఐసీడీఎస్‌ పీడీ


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 04 , 2024 | 11:33 PM

Advertising
Advertising
<