RAIN WATER : మడుగు కాదిది... రోడ్డే..!
ABN, Publish Date - Oct 18 , 2024 | 12:05 AM
మండలంలోని ఒంటికొండ గ్రామంలో ప్రధాన రహదారపైపై వర్షపు నీరు నిలిచి మడుగును తలపిస్తోంది. వర్షం కురిసినప్పుడల్లా నీరు నిలుస్తుం డటంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రధాన రోడ్డుపై పెద్దఎత్తున నీరు నిలిచింది.
చెన్నేకొత్తపల్లి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఒంటికొండ గ్రామంలో ప్రధాన రహదారపైపై వర్షపు నీరు నిలిచి మడుగును తలపిస్తోంది. వర్షం కురిసినప్పుడల్లా నీరు నిలుస్తుం డటంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రధాన రోడ్డుపై పెద్దఎత్తున నీరు నిలిచింది. రోడ్డు పక్కన ఏర్పాటుచేసిన కాలువను నాలుగేళ్ల క్రితం స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి వైసీపీ అండతో మట్టితో పూడ్చివేశాడని, అప్పటి నుంచి ఈ సమస్య తలెత్తిందని పలువురు గ్రామస్థులు అంటున్నారు. రోడ్డుపై దాదాపు రెండు వారాల పాటు నీరు నిల్వఉంటుందని, రాకపోకల సమయంలో పలువురు జారి కిందపడి ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. అంతేకాకుండా రోజుల తరబడి నీరు నిల్వఉండటంతో చుట్టుపక్కల ఇళ్లు దెబ్బతింటున్నాయని వారు వాపోతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Oct 18 , 2024 | 12:05 AM