JalaHarati దశాబ్దాల కల నెరవేరింది..
ABN, Publish Date - Dec 23 , 2024 | 11:40 PM
హంద్రీనీవా ద్వారా కృష్ణాజలాల రాకతో తలుపుల ప్రాంతవాసుల దశాబ్దాల కల నెరవేరిందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. తలుపుల మండలంలోని కోరుగుట్టపల్లి వద్ద హంద్రీనీవా ప్రధాన కాలువలో నీరు వచ్చిన సందర్భంగా సోమవారం ఆయన జలహారతి ఇచ్చారు.
ఎమ్మెల్యే కందికుంట
: కృష్ణమ్మకు జలహారతి
కదిరి, డిసెంబరు23(ఆంరఽధజ్యోతి): హంద్రీనీవా ద్వారా కృష్ణాజలాల రాకతో తలుపుల ప్రాంతవాసుల దశాబ్దాల కల నెరవేరిందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. తలుపుల మండలంలోని కోరుగుట్టపల్లి వద్ద హంద్రీనీవా ప్రధాన కాలువలో నీరు వచ్చిన సందర్భంగా సోమవారం ఆయన జలహారతి ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరువు ప్రాంతమైన కదిరికి కృష్ణాజలాలు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రధాన కాలువ ద్వారా కదిరి, తలుపుల, నంబులపూలకుంట మండలాలకు తాగు, సాగునీరు అందుతుందన్నారు. దశాబ్దాలుగా నీటికోసం ఈప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. వారి కల నేటికి సాకరమైందన్నారు. మండలంలోని చెరువులను నింపుతామన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చొరవతోనే ఈ ప్రాంతానికి నీరు వచ్చిందన్నారు. ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
Updated Date - Dec 23 , 2024 | 11:40 PM