CPM: దేశంలో జమిలి ఎన్నికలు అసాధ్యం : ఓబులు
ABN, Publish Date - Nov 10 , 2024 | 12:41 AM
ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో జమిలి ఎన్నికలు (ఒకే దేశం - ఒకే ఎన్నిక) అనేది సాధ్యం కాని అంశమని సీపీఎం రాషట్ట్ర నాయకుడు ఓబులు అన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు శనివారం అనంతపురం రూరల్ పంచాయతీలోని జేఎనటీయూ రోడ్డులో ప్రజా పోరుయాత్ర కార్యక్ర మాన్ని ప్రారంభించారు.
అనంతపురం రూరల్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో జమిలి ఎన్నికలు (ఒకే దేశం - ఒకే ఎన్నిక) అనేది సాధ్యం కాని అంశమని సీపీఎం రాషట్ట్ర నాయకుడు ఓబులు అన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు శనివారం అనంతపురం రూరల్ పంచాయతీలోని జేఎనటీయూ రోడ్డులో ప్రజా పోరుయాత్ర కార్యక్ర మాన్ని ప్రారంభించారు. జేఎనటీయూ మెయినరోడ్డు, రామకృష్ణకాలనీ మీదుగా కార్యక్రమం సాగింది. ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఓబులు హాజరై మాట్లాడారు. కేంద్రంలో ఎనడీఏ పా లనలో నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. వాటి తగ్గుదలకు ఎలాం టి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అలాగే పెట్రోలు, డీజల్ ధరలు తగ్గలేదన్నారు. నిరు ద్యోగ సమస్యగా విపరీతంగా పెరిగిందన్నారు. వీటిని పక్కదారి పట్టించడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జమిలి ఎన్నికలనే కొత్త నినాదం తెస్తోందన్నారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కరెంటు బిల్లుల్లో ట్రూ అప్ చార్జీలను ఉపసంహరించు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఎం జిల్లా కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, న్యూకమిటీ కార్యదర్శి ఆర్‌వినాయుడు, కార్యవర్గ సభ్యులు ముర్తుజా, ఇర్ఫాన, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావ్యతిరేక విధానాలను నిరసించాలి
అనంతపురం కల్చరల్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఒక్కరూ నిరసించాలని ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి డి మాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ప్రజాపోరు యాత్ర రెండోరోజున శనివారం 49వ డివిజన పరిధిలోని ఇందిరా గాంధీ నగర్, ముత్యాలమ్మ కాలనీ, ఆర్కే నగర్, ఎస్సీ కాలనీ, సీపీఎం కాలనీ, గౌరవ్ గార్డెన్సలలో సాగింది. ఆ పార్టీ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ కరపత్రా లను పంచి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సావిత్రితో పాటు సీపీఎం నగర 1వ కమిటీ కార్యదర్శి రామిరెడ్డి, సీపీఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు వెంకటనారాయణ, ప్రకాష్, నగర నాయకులు నూరుల్లా, మసూద్, ఎన్టీఆర్ శీన, ఐద్వా నాయకురాలు చంద్రిక, పర్వాది, సునంద, రేణుక తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Nov 10 , 2024 | 12:41 AM