AP ELECTIONS : జేఎనటీయూ రెడీ..!
ABN, Publish Date - Jun 04 , 2024 | 12:19 AM
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ పర్యవేక్షణలో ఏర్పాట్లు చేయించారు. ఎస్పీ గౌతమిశాలి నేతృత్వంలో కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జేఎనటీయూలోని కౌంటింగ్ కేంద్రంలో మంగళవారం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అనంతపురం పార్లమెంటు స్థానంతోపాటు రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంతపురం(అర్బన), కళ్యాణదుర్గం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల ...
ఉదయం 8 నుంచే కౌంటింగ్
ఒక ఎంపీ, ఎనిమిది ఎమ్మెల్యే
స్థానాలు తొలి ఫలితం ఉరవకొండ..
తుది ఫలితం రాయదుర్గం
ఫ్యాన పార్టీకి చెమటలు పట్టిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
అనంతపురం టౌన, జూన 3: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ పర్యవేక్షణలో ఏర్పాట్లు చేయించారు. ఎస్పీ గౌతమిశాలి నేతృత్వంలో కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జేఎనటీయూలోని కౌంటింగ్ కేంద్రంలో మంగళవారం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అనంతపురం పార్లమెంటు స్థానంతోపాటు రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంతపురం(అర్బన), కళ్యాణదుర్గం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ జేఎనటీయూలో జరుగుతుంది. ప్రతి నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు
ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 16,36,316 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ నిర్వహణకు 1,376 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. జిల్లాలోని 8 నియోజకవర్గాలకు 116 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో రాయదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంతపురం, కళ్యాణదుర్గం, రాప్తాడు నియోజకవర్గాలకు 14 టేబుల్స్, ఉరవకొండ నియోజకవర్గానికి 18 టేబుల్స్ ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచి వచ్చిన కౌంటింగ్ పరిశీలకులు మనీష్ సింగ్, అజయ్‌నాథ్, అజయ్‌కుమార్.. జేఎనటీయూలో తిష్టవేసి పరిశీలిస్తున్నారు.
ఉదయం 8 గంటల నుంచే..
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకే మొదలవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌ను ప్రారంభిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారీగా పోలైనందున కౌంటింగ్ ఆలస్యం అవుతుంది. దీంతో దీనికి సమాంతరంగా 8:30 గంటల నుంచి ఈవీఎంల కౌంటింగ్ మొదలవుతుంది. ఈవీఎంల కౌంటింగ్ ఒక్కో రౌండ్‌కు 20 నుంచి 25 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ లెక్కన ఈవీఎంల కౌంటింగ్ సాయంత్రం 5 నుంచి 6 గంటలలోపు పూర్తి అయ్యే అవకాశాలు
కనిపిస్తున్నాయి.
తొలి ఫలితం ఉరవకొండదే..
మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉరవకొండ ఫలితం మొదట వెలువడనుంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,92,441 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల కమిషన సూచనల మేరకు కౌంటింగ్‌కు ఇక్కడ ప్రత్యేకంగా 18 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 15 రౌండ్‌లలో లెక్కింపు పూర్తి అవుతుంది. ఆ తర్వాత 19 రౌండ్లలో కళ్యాణదుర్గం ఫలితం వస్తుంది. మూడో ఫలితం గుంతకల్లు, తాడిపత్రి కౌంటింగ్ 20 రౌండ్లలో తేలుతుంది. ఆ తరువాత శింగనమల, అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల ఫలితాలు 21 రౌండ్లలో వెలువడతాయి. చివరగా రాయదుర్గం ఫలితం వస్తుంది. ఇక్కడ జిల్లాలో అత్యధికంగా 22 రౌండ్‌లపాటు లెక్కింపు కొనసాగుతుంది.
ఫ్యానకు పోస్టల్ బ్యాలెట్ ఉక్కపోత
అధికార వైసీపీకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చెమటలు పట్టిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ ఓట్లు తమకు వ్యతిరేకంగా పోలవుతాయని భావించిన ఆ పార్టీ అభ్యర్థులు.. అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. చివరకు చెల్లని ఓట్ల సంఖ్య పెంచేందుకూ ప్రయత్నిస్తున్నారు. కూటమి విజయం తథ్యమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయడంతో ఫ్యాన పార్టీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌పై గగ్గోలు పెడుతోంది. వైసీపీ అభ్యర్థుల ఓటమిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలకం కానున్నాయని భావిస్తున్నారు. దీంతో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సమయంలో ఆ పార్టీ ఏజెంట్లు గొడవలకు దిగి, గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల అధికారులు, పోలీసులు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌కు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jun 04 , 2024 | 12:19 AM