BJP: వైసీపీ అధికారుల నిర్లక్ష్యంతోనే హత్య
ABN, Publish Date - Nov 18 , 2024 | 11:50 PM
బీజేపీ సీనియర్ కార్యకర్త కామిశెట్టి కృష్ణమూర్తి హత్యకు వైసీపీ ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు మండిపడ్డారు. రోడ్లు, భవనాల అతిథిగృహంలో బాధిత కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కృష్ణమూర్తి హత్యకు దారితీసిన కారణాలను సందిరెడ్డి వివరించారు.
అనంతపురం సెంట్రల్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): బీజేపీ సీనియర్ కార్యకర్త కామిశెట్టి కృష్ణమూర్తి హత్యకు వైసీపీ ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు మండిపడ్డారు. రోడ్లు, భవనాల అతిథిగృహంలో బాధిత కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కృష్ణమూర్తి హత్యకు దారితీసిన కారణాలను సందిరెడ్డి వివరించారు. బొమ్మనహాళ్ మండలం చంద్రగిరికి చెందిన కామిశెట్టి కృష్ణమూర్తికి అదే మండలం కురవహళ్లికి చెందిన వైసీపీ కార్యకర్త బోయ శ్రీనివాసులు పొలాన్ని అమ్మారని తెలిపారు. అనంతరం తిరగబడిన శ్రీనివాసులు తరచూ కృష్ణమూర్తితో గొడవలకు దిగేవాడన్నారు. గొడవలెందుకుని భావించిన కృష్ణమూర్తి ఆయనకొన్న పొలంలోనే కొన్ని సెంట్ల భూమిని శ్రీనివాసులకు తిరిగి అప్పగించారని తెలిపారు. అయినా 2021లో కృష్ణమూర్తిపై హత్యా యత్నం చేశారని వాపోయారు. సమస్యను పరిష్కరించాలని నిందితులపై కేసు నమోదుచేసి న్యాయం చేయాలని మూడు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగారన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. చివరికి కృష్ణమూర్తి హతమయ్యాడని పేర్కొన్నారు. హత్యచేసిన బోయ శ్రీనివాసులు, సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు. అదేవిధంగా సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం జిల్లా ఎస్పీ జగదీ్‌షను కలిసి ఫిర్యాదుచేశారు. కార్యక్రమంలో నాయకులు రత్నమయ్య, దేవిరెడ్డి లక్ష్మిదేవి, లలితకుమార్, అశోక్‌రెడ్డి, గోపాల్, సూర్యప్రకాష్, సోమయ్య, ఇలియాజ్, దిలీప్, రాజేష్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 18 , 2024 | 11:50 PM