ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lawars శేషాద్రి మృతిపై విచారణ జరపాలి

ABN, Publish Date - Dec 30 , 2024 | 11:25 PM

సీనియర్‌ న్యాయవాది శేషాద్రి మృతిపై సమగ్ర విచారణ చేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. బార్‌ అసోసియేషన జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులు నగరంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. సప్తగిరి సర్కిల్‌, క్లాక్‌ టవర్‌ సెంటర్లలో మానవహారం నిర్వహించారు.

నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్న న్యాయవాదులు

న్యాయవాదులు, ప్రజా సంఘాల డిమాండ్‌

నగరంలో నిరసన ర్యాలీ

అనంతపురం క్రైం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): సీనియర్‌ న్యాయవాది శేషాద్రి మృతిపై సమగ్ర విచారణ చేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. బార్‌ అసోసియేషన జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులు నగరంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. సప్తగిరి సర్కిల్‌, క్లాక్‌ టవర్‌ సెంటర్లలో మానవహారం నిర్వహించారు. న్యాయవాది శేషాద్రి సీఐ చాంబర్‌లోనే మృతి చెందారని, ఈ విషయంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయని అన్నారు. శేషాద్రిని పోలీస్‌ వాహనంలో ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి పోలీసులు 29వ తేదీ రాత్రి వరకు కాలయాపన చేయడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. పోస్టుమార్టం విషయంలోనూ అలసత్వం వహించారని అన్నారు. శేషాద్రిని విచారణ పేరుతో రాత్రి వేళల్లో పిలిపించి, కక్షిదారుల ఎదుట అవమానించారని, అందుకే గుండెపోటు వచ్చిందని ఆరోపించారు. కనీస మర్యాద ఇవ్వలేదని, సెల్‌ఫోన్లు ఎందుకు లాగేసుకున్నారని ప్రశ్నించారు. రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేపడితే తప్ప పోస్టుమార్టం జరపలేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికైనా విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు నారాయణరెడ్డి, వెంకటరాముడు, నాగిరెడ్డి, పోతులయ్య, నాగన్న, బోరంపల్లి ఆంజనేయులు, చంద్ర, హరి, హనుమన్న, సుబ్బన్న, మహిళా న్యాయవాదులు, సీసీఐ ఎంఎల్‌ నాయకులు చంద్రశేఖర్‌, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకేహరి, నాయకులు రామకృష్ణ, వెంకటేశు, చంద్రబాబు, కదిరప్ప, నాగేంద్ర, కుళ్లాయప్ప పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 11:25 PM