ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

GAMES : పిల్లలకు ఆటల్లేవ్‌!

ABN, Publish Date - May 19 , 2024 | 11:27 PM

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణ పట్ల శీతకన్ను వేసింది. ఐదేళ్ల పాలనా కాలంలో రెండేళ్లు మాత్రమే ఈ శిబిరాలు నిర్వహించింది. అందులోనూ క్రీడాకారులకు ఎటువంటి కిట్లు ఇవ్వకుండా, కోచలకు గౌరవ వేతనం చెల్లించకుండా మమా అనిపించేసింది. ఈ ఏడాదిలో మే 1 నుంచి సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులు నిర్వహిస్తామని కోచల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. తరువాత సార్వత్రిక ఎన్నికలు అంటూ మే 15కి వాయిదా వేశారు. తిరిగి ఈ ఏడాది రెగ్యులర్‌గా శాప్‌ కోచలు నిర్వహించే శిక్షణ కేంద్రాలనే సమ్మర్‌...

వేసవి క్రీడాశిక్షణ శిబిరాలు లేనట్లే

ఐదేళ్లలో రెండుసార్లే నిర్వహణ

పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణ పట్ల శీతకన్ను వేసింది. ఐదేళ్ల పాలనా కాలంలో రెండేళ్లు మాత్రమే ఈ శిబిరాలు నిర్వహించింది. అందులోనూ క్రీడాకారులకు ఎటువంటి కిట్లు ఇవ్వకుండా, కోచలకు గౌరవ వేతనం చెల్లించకుండా మమా అనిపించేసింది. ఈ ఏడాదిలో మే 1 నుంచి సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులు నిర్వహిస్తామని కోచల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. తరువాత సార్వత్రిక ఎన్నికలు అంటూ మే 15కి వాయిదా వేశారు. తిరిగి ఈ ఏడాది రెగ్యులర్‌గా శాప్‌ కోచలు నిర్వహించే శిక్షణ కేంద్రాలనే సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులుగా నిర్వహించాలని శాప్‌ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ


చేశారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లలో వందలాది మంది క్రీడాకారులు వేసవి శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకుని మెరుగైన స్థానాలను సంపాదించుకున్నారు.

- అనంతపురం క్లాక్‌టవర్‌

రెండేళ్లే నిర్వహణ..

వైసీపీ ఐదేళ్ల పాలనా కాలంలో రెండేళ్లే వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైనా ఆ ఏడాదిలో సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులు నిర్వహించలేదు. 2020, 2021లో కరోనా సాకుతో నిర్వహించకుండా వదిలేశారు. 2022, 2023లో నామమాత్రంగా వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహించారు. మొత్తం జిల్లాకు 50సెంటర్ల పేరుతో హడావుడి చేసినా చివరికి నిర్వహించింది 30మాత్రమే. ఇందులో కూడా క్రీడాకారులకు సామాగ్రి లేదు, కోచలకు గౌరవ వేతనం ఇవ్వలేదు. దీంతో అటు క్రీడాకారులు, ఇటు కోచలు వేసవి క్రీడా శిక్షణా శిబిరాల పట్ల నిరాసక్తత ప్రదర్శించారు. ఇదే అదనుగా రాష్ట్ర ప్రభుత్వం సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులను ఎత్తివేసింది.


పిల్లలను క్రీడలకు దూరం చేస్తున్న వైనం

క్రీడలు, వ్యాయామం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ప్రగల్భాలు పలికిన సీఎం జగన ఆచరణలో మాత్రం నిర్వీర్యం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను గాలికొదిలేసింది. దీంతో వేసవి సెలవుల్లో బాగా ఆడాలని ఎదురుచూసిన పిల్లలు వేసవి క్రీడా శిక్షణా శిబిరాల నిర్వహణ లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఇదంతా పిల్లలను క్రీడలకు దూరం చేయడంలో భాగమేనని క్రీడాకారులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఉమ్మడి జిల్లాలో 100 కేంద్రాల్లో సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులు నిర్వహించి, క్రీడాకారులకు కిట్లు, కోచలకు గౌరవ వేతనం ఇచ్చిన విషయాన్ని ప్రస్తుతం కొందరు గుర్తు చేసుకుంటున్నారు.

శాప్‌ కోచలతోనే...: షేక్‌ షఫీ, డీఎస్‌డీఓ

సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపుల నిర్వహణకు దరఖాస్తులు తీసుకున్న మాట వాస్తవమే. శాప్‌ ఆదేశాల మేరకే కోచల నుంచి దరఖాస్తులను స్వీకరించాం. మే 1 నుంచి అన్నారు...ఆ తరువాత మే 15కి వాయిదావేశారు. ఇక ఏడాదికి సంబంధించి శాప్‌ కోచలు ఇస్తున్న రెగ్యులర్‌ కేంద్రాల్లోనే వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహించాలని శాప్‌ అధికారులు సూచించారు. ఈ విషయాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న 12మంది శాప్‌ కోచలకు సూచించాం. శాప్‌ ఆదేశాల మేరకు సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులు నిర్వహిస్తున్నాం.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 19 , 2024 | 11:27 PM

Advertising
Advertising