MLA AMILINENI: ప్రశాంత వాతావరణంలో జీవించాలి
ABN, Publish Date - Dec 26 , 2024 | 12:08 AM
ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో జీవించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. బుధవారం క్రిస్మస్ సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణం, కంబదూరులోని చర్చిలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో జీవించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. బుధవారం క్రిస్మస్ సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణం, కంబదూరులోని చర్చిలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆయా చర్చిల్లో ఎమ్మెల్యే ప్రార్థనలు చేశారు. ఆయా చర్చిల ఫాస్టర్లు, సంఘ పెద్దలు, టీడీపీ నాయకులు, పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందచేత: పట్టణంలోని ప్రజావేదికలో బుధవారం రూ.10 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు బాధిత కుటుంబ సభ్యులకు అందచేశారు. బ్రహ్మసముద్రం మండలం గుండిగానిపల్లికి చెందిన వర్షిత అనారోగ్యంతో బాధపడుతుండడంతో వైద్యం కోసం రూ.10 లక్షల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందచేశారు.
Updated Date - Dec 26 , 2024 | 12:08 AM