ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ADCC Bank : నకిలీలకు రుణాలు

ABN, Publish Date - Dec 05 , 2024 | 01:09 AM

జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో (ఏడీసీసీ) తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ పట్టాలకు రుణాలు మంజూరు చేసిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. వజ్రకరూరు, తాడిపత్రి, యాడికి, రాప్తాడులో ఇలా భారీగా అక్రమాలు జరిగాయి. ఆత్మకూరులో నకిలీ పట్టాలతో రుణాలు పొందిన వ్యవహారంలో ప్రధాన కార్యాలయంలోని ఓ అధికారి కీలకంగా వ్యవహరించారని తేల్చారు. ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఇంకో అధికారికి విచారణ బాధ్యతలు అప్పగించారు. కానీ తూతూమంత్రంగా విచారణ జరిపి, తనకు ఎవరూ సహకరించడం లేదని ...

ADCC Bank Head Office

ఏడీసీసీబీలో అంతులేని అక్రమాలు

తాడిపత్రి, యాడికి, రాప్తాడులో వెలుగులోకి..

తూతూమంత్రంగా విచారణ.. నివేదికలు

ప్రేక్షకపాత్రకు పరిమితమైన పర్సన ఇనచార్జి

అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో (ఏడీసీసీ) తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ పట్టాలకు రుణాలు మంజూరు చేసిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. వజ్రకరూరు, తాడిపత్రి, యాడికి, రాప్తాడులో ఇలా భారీగా అక్రమాలు జరిగాయి. ఆత్మకూరులో నకిలీ పట్టాలతో రుణాలు పొందిన వ్యవహారంలో ప్రధాన కార్యాలయంలోని ఓ అధికారి కీలకంగా వ్యవహరించారని తేల్చారు. ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఇంకో అధికారికి విచారణ బాధ్యతలు అప్పగించారు. కానీ తూతూమంత్రంగా విచారణ జరిపి, తనకు ఎవరూ సహకరించడం లేదని


నివేదికను అందజేసి చేతులు దులుపుకున్నారు. విచారణ అధికారి, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి మిలాఖత అయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఇద్దరు అధికారులు మొదటి నుంచి సన్నిహితులని, అలాంటప్పుడు వాస్తవాలు ఎలా వెలుగులోకి వస్తాయని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పాలకవర్గం లేని బ్యాంకునకు జాయింట్‌ కలెక్టర్‌ను ప్రభుత్వం పర్సన ఇనచార్జిగా నియమించింది. ఆయన కళ్లెదుటే మహాజన సభలో ఒక్కరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. సహకార శాఖ అధికారులు ఆధారాలు చూపించినా, అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారుల్లో ఉన్న విభేదాలను సాకుగా చూపించి, కొందరిని వెనకేసుకొస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

నకిలీలకు రుణాలు

వజ్రకరూరు, తాడిపత్రి, యాడికి, రాప్తాడులో నకిలీ పాసుపుస్తకాలకు రుణాలు ఇచ్చినట్లు గుర్తించారు. తాడిపత్రి బ్రాంచ పరిధిలోని 10 సొసైటీల్లో, ప్రధానంగా యాడికి సొసైటీలో నకిలీ పాసుపుస్తకాలకు రుణాలు చెల్లించినట్లు బ్యాంకు అధికారులు తేల్చారు. అయితే బ్యాంకు, సొసైటీ అధికారులు కలిసి ఇలాంటివి నడిపిస్తారని అంటున్నారు. తాజాగా అనంతపురం రామ్‌నగర్‌ బ్రాంచలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మరూరు సొసైటీలో లేని భూమిని ఉన్న సృష్టించి 2017లో రుణాలు పొందారు. ఈ వ్యవహారంపై రాప్తాడు పోలీసుస్టేషనలో పంచాయితీ చేశారు. ఆ తరువాత కేసు నమోదు చేశారు. ఇటీవల ఏడీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి వచ్చి ఆరా తీసినట్లు సమాచారం.

ఉత్తుత్తి విచారణ

ఆత్మకూరుబ్రాంచ పరిధిలోని 2015-16లో ఆరుగురు రైతులకు రూ.30లక్షల వరకు రుణాలు ఇచ్చారు. వారివి అసైన్డ పట్టాలని తేల్చారు. తొమ్మిదేళ్లకుగానూ వడ్డీతో కలిపి రుణం రూ.30 లక్షలకు చేరింది. ఈ రుణాల మంజూరులో ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి కీలకపాత్రధారి అని సమాచారం. దీనిపై విచారించాలని జిల్లా కేంద్రంలోని ఓ అధికారికి బాధ్యతలు అప్పగించారు. ఆయన తూతూమంత్రంగా విచారించి.. నివేదికను అందజేశారు. విచారణకు ఎవరూ సహకరించడం లేదని అందులో పేర్కొన్నట్లు సమాచారం. ఏడాది పొడవునా రైతులకు పంట రుణాలు ఇస్తామని చేసిన ప్రకటన కొందరు అధికారులకు పంట పండిస్తోంది. ఇద్దరు కీలక అధికారులు రుణం చెల్లించే ప్రతి ఫైల్‌కు ఓ రేటు ఫిక్స్‌ చేశారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు వేర్వేరుగా చెల్లిస్తారు. ఎకరాకు రూ.40వేలు నుంచి పంట ఆధారంగా రూ.80వేలు వరకు చెల్లిస్తున్నారు. ఇందులో 10శాతం ఆ ఇద్దరు అధికారులకు రైతులు ముడుపులు చెల్లించాల్సి వస్తోందని సమాచారం. పర్సెంటేజీ ఇవ్వకుంటే కుంటి సాకులతో రుణాలు ఇవ్వడం లేదని, సొసైటీ, బ్యాంకులు, ప్రధాన కార్యాలయం చుట్టూ తిప్పుకుంటారని బాధితులు మండిపడుతున్నారు.

ప్రేక్షకపాత్ర

ఏడీసీసీబీకి జాయింట్‌ కలెక్టర్‌ ఆరు నెలలుగా పర్సన ఇనచార్జిగా కొనసాగుతున్నారు. అవినీతి, అక్రమాలు బయట పడుతున్నా.. పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మహాజన సభలో రైతు రుణాల వడ్డీ రాయితీలో అక్రమాలు జరిగాయని సహకార శాఖ అధికారులు ఆధారాలు చూపించినా చర్యలు తీసుకోలేదు. అధికారుల మధ్య సమన్వయం కుదర్చలేకపోతున్నారు. అలాంటప్పుడు పర్సన ఇనచార్జి ఉండి ఏం ప్రయోజనమని రైతులు, ఖాతాదారులు పెదవి విరుస్తున్నారు. కాగా, హైదరాబాద్‌కు డెప్యుటేషనపై వెళ్లి ఇటీవల వచ్చిన ఓ అధికారి ఉద్యోగుల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఆ అధికారి వ్యవహారం కూడా పర్సన ఇనచార్జి దృష్టికి వెళ్లినట్లు సమాచారం.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం..

సహకార సంఘాలు, బ్యాంకులో జరిగే ప్రతి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. రైతులతో ముడిపడి ఉన్న బ్యాంకు, సొసైటీలను సక్రమంగా నడిపించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఉన్నతాధికారులతో పాటు పాలకవర్గం స్థానంలో ఉన్న పర్సన ఇనచార్జికి తెలియజేస్తున్నాం. కొన్నింటిపై విచారణ చేసి అధికారులకు నివేదిక అందజేశాం. ఇందులో ఎటువంటి రహస్యం లేదు. ఒరిజినల్‌ పట్టాలకే బ్యాంకు, సొసైటీల నుంచి రుణాలు చెల్లిస్తున్నాం. ఎక్కడైనా నకిలీ కనబడితే రుణాలు చెల్లించిన అధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం.

- సురేఖారాణి, ఏడీసీసీ బ్యాంకు సీఈఓ


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 05 , 2024 | 09:57 AM