LOK ADALAT: రాజీకేసులకు లోక్ అదాలత చక్కటి పరిష్కారం
ABN, Publish Date - Dec 15 , 2024 | 12:34 AM
రాజీకాదగ్గ కేసులకు లోక్ అదాలత చక్కటి పరిష్కారమని పుట్టపర్తి జూనియర్ సివిల్ నాయాధికారి రాకేష్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని జూనియర్‌సివిల్ జడ్జి కోర్టులో న్యాయాధికారి రాకేష్ అధ్యక్షతన జాతీయ లోక్ అదాలత నిర్వహించారు.
పుట్టపర్తి రూరల్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాజీకాదగ్గ కేసులకు లోక్ అదాలత చక్కటి పరిష్కారమని పుట్టపర్తి జూనియర్ సివిల్ నాయాధికారి రాకేష్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని జూనియర్‌సివిల్ జడ్జి కోర్టులో న్యాయాధికారి రాకేష్ అధ్యక్షతన జాతీయ లోక్ అదాలత నిర్వహించారు. సీజ్డ్‌మనీ 37,320, సివిల్, క్రిమినల్, బ్యాంకు ప్రీలిటిగేషన కింద కేసులకు సంబందించి రూ.16,54,160 విలువైన కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. మొత్తం 129 కేసులు పరిష్కరించామన్నారు. బార్ అసోసియేషన అద్యక్షుడు కత్తి గంగిరెడ్డి, లోక్ అదాలత సభ్యులు రాజేంద్ర ప్రసాద్‌రెడ్డి, లెక్కల యదుభూషణ్, పూజారి ప్రసాద్, నిడిమామిడి శ్రీనివాసులు, నాగేంద్ర, భారతిరెడ్డి, చల్లా చంద్రశేఖర్, కుంచెపు శ్రీనివాసులు, ఝాన్సీరాణి, అరుణ్‌కిరణ్, క్రిమినల్ క్లర్క్ మంజునాథ్, సివిల్‌క్లర్క్ అశ్వత్థ నారాయణ, ఎంఎల్‌ఏసీ లక్ష్మానాయక్ పాల్గొన్నారు.
ప్రజా న్యాయస్థానంతో ప్రశాంతత: న్యాయాధికారి జయలక్ష్మి
కదిరిలీగల్: ప్రజా న్యాయస్థానాలతో కేసుల పరిష్కారం వల్ల ప్రశాంతతకు తావిస్తుందని మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన, న్యాయాధికారి ఎస్ జయలక్ష్మి పేర్కొన్నారు. జాతీయ లోక్‌అదాలతను కోర్టుల ఆవరణలో ఆమె శనివారం ప్రారంభించారు. తాను ఒక బెంచుకు న్యాయాధికారులు ఎస్ ప్రతిమ, పీ మీనాక్షిసుందరి, ఇతర రెండు బెంచులకు నేతృత్వం వహించి కేసులను పరిష్కరించారు. న్యాయాధికారులకు సహాయంగా న్యాయవాదులు అంబటి శివప్రసాద్, రవీంద్ర, క్షత్రియనాయక్, ఆంజనేయులు, జ్ఞానేందర్‌రెడ్డి, కాలేనాయక్ వ్యవహరించారు. మూడు బెంచల ద్వారా మొత్తం 259 కేసులు పరిష్కరించినట్లు న్యాయాధికారి తెలిపారు. కేసుల పరిష్కారం అనంతరం ఎలాంటి సమస్యలు తలెత్తవని న్యాయాధికారి స్పష్టం చేశారు.
రాజీమార్గంతో జీవితం సుఖమయం
ధర్మవరం: రాజీమార్గంతో జీవితం సుఖమయం అవుతుందని సీనియర్ సివిల్ నాయాధికారి గీతావాణి, జూనియర్ సివిల్ న్యాయాధికారి రమ్యసాయి అన్నారు. శనివారం స్థానిక కోర్టులో జాతీయ మెగాలోక్ అదాలత నిర్వహించారు. న్యాయాధికారులు మాట్లాడుతూ క్షణికావేశానికిలోనై తప్పులు చేసి కేసుల్లో ఇరుక్కుని కోర్టులు చుట్టూ తిరుగుతున్నారన్నారు.
Updated Date - Dec 15 , 2024 | 12:34 AM