JALA SADHANA: హంద్రీనీవా లైనింగ్‌తో నష్టం
ABN, Publish Date - Dec 21 , 2024 | 12:24 AM
హంద్రీనీవా కాలువ లైనింగ్‌తో జిల్లా రైతాంగానికి తీవ్రనష్టం కలుగుతుందని, ఆ పనులను వెంటనే ఆపాలని జలసాధన సమతి నాయకులు డిమాండ్ చేశారు. లైనింగ్ వేయడానికి బదులుగా కాలువను వెడల్లుప చేయాలని కోరారు.
జలసాధన సమితి డిమాండ్
అనంతపురం క్లాక్‌టవర్, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా కాలువ లైనింగ్‌తో జిల్లా రైతాంగానికి తీవ్రనష్టం కలుగుతుందని, ఆ పనులను వెంటనే ఆపాలని జలసాధన సమతి నాయకులు డిమాండ్ చేశారు. లైనింగ్ వేయడానికి బదులుగా కాలువను వెడల్లుప చేయాలని కోరారు. హంద్రీనీవా ప్రయోజనాలకు సమాధి కట్టే 404, 405 జీఓలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జలవనరుల శాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, సాగునీటిరంగ నిపుణులు ఎస్‌ఎం బాషా, రచయిత శాంతి నారాయణ, జలసాధన సమితి అధ్యక్షుడు రామ్‌కుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓలు హంద్రీనీవా ప్రాజెక్ట్ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, రాయలసీమ ప్రజలకు తీవ్రనష్టం కలిగించే ఆ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమలోని ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు, జిల్లాలో ఉన్న 3.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రూపకల్పన చేసిన హంద్రీనీవా ప్రాజెక్ట్‌ను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. హంద్రీనీవా ప్రధాన లక్ష్యం ప్రకారం మల్యాల నుంచి జీడిపల్లి వరకు 10 వేల క్యూసెక్కులు, జీడిపల్లి నుంచి గొల్లపల్లి వరకు 6 వేల క్యూసెక్కులు, గొల్లపల్లి నుంచి మారాల వరకు 5వేల క్యూసెక్కులు, మారాల నుంచి చెర్లోపల్లికి 4500 క్యూసెక్కులు, మడకశిర బ్రాంచ కెనాల్‌కు 1500 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలవను వెడల్పు చేయాలని కోరారు. శ్రీశైలం నుంచి తెచ్చుకున్న కృష్ణా జలాలను నిల్వ చేసుకోవడానికి అవసరమయ్యే ప్రాజెక్టులు, డిసి్ట్రబ్యూటరీలను వెంటనే నిర్మించి జిల్లాను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం హంద్రీన్రీవా చీఫ్ ఇంజనీర్ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, జలసాధన సమితి ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి, రైతుసంఘం నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, సీపీఎం నాయకుడు మల్లికార్జున, అఖిలభారత రైతుసంఘాల నాయకులు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వివిధ సంఘాల నాయకులు కృష్ణ, సురేష్, యేసు, పెద్దన్న, వీరనారప్ప, చంద్ర, వెంకటేష్, నల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 21 , 2024 | 12:24 AM