BALAYYA: నోటికాడి భోజనం లాగేసిన వైసీపీ
ABN , Publish Date - Apr 28 , 2024 | 11:57 PM
వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటినను మూసేసి, పేదల నోటికాడ భోజనం లాగేసుకున్నారని నందమూరి బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధరాదేవి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆదివారం స్థానిక కొల్లకుంట ఆంజనేయస్వామి ఆలయంలో పూజల అనంతరం ఒకటి నుంచి ఆరో వార్డు వరకు పర్యటించారు. ఈ సందర్భంగా కొల్లకుంటలో ఆమె మాట్లాడుతూ... వైసీపీ ఐదేళ్లకాలంలో అన్నింటినీ రద్దుచేసింది తప్ప ప్రజలకు మేలు చేసే ఏ ఒక్క పథకం తీసుకురాలేదన్నారు.
ఇది నందమూరి పురం
ఎన్నికల ప్రచారంలో
నందమూరి వసుంధరాదేవి
హిందూపురం, ఏప్రిల్ 28: వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటినను మూసేసి, పేదల నోటికాడ భోజనం లాగేసుకున్నారని నందమూరి బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధరాదేవి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆదివారం స్థానిక కొల్లకుంట ఆంజనేయస్వామి ఆలయంలో పూజల అనంతరం ఒకటి నుంచి ఆరో వార్డు వరకు పర్యటించారు. ఈ సందర్భంగా కొల్లకుంటలో ఆమె మాట్లాడుతూ... వైసీపీ ఐదేళ్లకాలంలో అన్నింటినీ రద్దుచేసింది తప్ప ప్రజలకు మేలు చేసే ఏ ఒక్క పథకం తీసుకురాలేదన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకోసం బాలకృష్ణ హిందూపురం నుంచి మూడోసారి గెలవనున్నారని అన్నారు.
నియోజకవర్గానికి ఎన్టీఆర్ చే యాలనుకున్న పనులన్నీ బాలకృష్ణ పూర్తిచేస్తారన్నారు. టీడీపీ అధికారం లో లేకపోయినా కొవిడ్ సమయంలో సొంత నిధులతో పురం ఆసుపత్రికి పరికరాలు, మందులు అందించామ న్నారు. హిందూపురమంటే నంద మూరి పురమని, ఈ నియోజకవర్గం లోని ప్రజలంతా తమ కుటుంబ స భ్యులన్నారు. బాలకృష్ణ ఎక్కడున్నా హిందూపురం అభివృద్ధి పైనే ఽధ్యాస అన్నారు. టీడీపీ హయాంలో హిం దూపురం ఆసుపత్రి ఎంతో మెరుగ్గా ఉండేదని, నేడు ఆ పరిస్థితి లేదన్నా రు.
ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కడా జరగలేదని, హిందూపురం నుంచి బాలకృష్ణ గెలిచి, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందన్నారు. బాలకృష్ణ హ్యాట్రిక్ సాధిస్తారన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు బాగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్యంపై బాలకృష్ణకు చాలా శ్రద్ధ ఎక్కువన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజనప్ప, మునిసిపల్ మాజీ చైర్‌పర్సన రావిళ్లలక్ష్మి, లీగల్‌సెల్ జిల్లా అధ్యక్షుడు శివశంకర్, పట్టణాధ్యక్షుడు రమేష్, మునిసిపల్ మాజీ చైర్మన అనిల్‌కుమార్, ప్రెస్ వెంకటేశ, నెట్టప్ప, తిరుపతయ్య, చంద్రమోహన, నాగభూషణ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....