MLA SUNITA : సభ్యత్వ నమోదును బాధ్యతగా చేపట్టాలి
ABN, Publish Date - Nov 24 , 2024 | 12:54 AM
టీడీపీ సభ్యత్వ నమోదును ప్రతి ఒక్కరు బాధ్యాతగా తీసుకోవాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. నిర్దేశించిన సమయంలోగా లక్ష్యాన్ని పూర్తీ చేసి రాప్తాడు నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలన్నారు. మండలాలలో చేపట్టిన సభ్యత్వ ప్రక్రియపై ఆమె శనివారం టీడీపీ చెన్నేకొత్తపల్లి, రామగిరి కార్యాలయాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలు, బూతల వారీగా సభ్యత్వ నమోదు వివరాలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ...నియోజకవర్గంలో చెన్నేకొత్తప ల్లి, రామగిరి మండలాలు వెనుకంజలో ఉన్నాయన్నారు.
రాప్తాడు నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలి
టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే పరిటాల సునీత
చెన్నేకొత్తపల్లి/రామగిరి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): టీడీపీ సభ్యత్వ నమోదును ప్రతి ఒక్కరు బాధ్యాతగా తీసుకోవాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. నిర్దేశించిన సమయంలోగా లక్ష్యాన్ని పూర్తీ చేసి రాప్తాడు నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలన్నారు. మండలాలలో చేపట్టిన సభ్యత్వ ప్రక్రియపై ఆమె శనివారం టీడీపీ చెన్నేకొత్తపల్లి, రామగిరి కార్యాలయాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలు, బూతల వారీగా సభ్యత్వ నమోదు వివరాలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ...నియోజకవర్గంలో చెన్నేకొత్తప ల్లి, రామగిరి మండలాలు వెనుకంజలో ఉన్నాయన్నారు. ఇప్పటి నుంచైనా నా యకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. నియోజకవర్గంలో 65 వేలకు పైగా సభ్యత్వ నమోదు చేయాల్సి ఉండగా ఇప్పటికే సగానికిపైగా పూర్త యిందన్నారు. టీడీపీపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని, అధికారంలోకి వచ్చిన తరువాత అది మరింత పెరిగిందన్నారు. దీంతో చాలా మంది సభ్యత్వ నమోదుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. అయితే నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లేక వారిని ప్రోత్సహించడంలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచు కుని విరివిగా సభ్యత్వాలు చేయడం వల్ల మంచిఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ సమావేశంలో టీడీపీ ఆయా మండలాల కన్వీనర్లు ముత్యాల్‌రెడ్డి, సుధాకర్, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు కుంటిమద్ది రంగయ్య, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దండు ఓబుళేశు, రామ్మూర్తినాయుడు, అంకే అమరేంద్ర, రాజు, ఫణీంద్ర, ఏపీ శ్రీనివాసులు, ముత్యాలప్ప, రామగిరి మండల ప్రధానకార్యదర్శి మారుతీప్రసాద్, రఘువీరప్ప, ఎస్సీసెల్ సుబ్బరాయుడు, ఎంపీటీసీ శ్రీనివాసులు, పోలేపల్లి ప్రభాకర్, దుబ్బార్లపల్లి వెంకటేశ, నాగేశ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Nov 24 , 2024 | 12:54 AM