MLA DAGGUPATI: లక్ష మందితో సభ్యత్వం
ABN, Publish Date - Oct 27 , 2024 | 12:28 AM
అనంతపురం అర్బనలో లక్ష మందితో పార్టీ సభ్యత్వం చేయిస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు.
అనంతపురం అర్బన, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): అనంతపురం అర్బనలో లక్ష మందితో పార్టీ సభ్యత్వం చేయిస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు. శనివారం 35వ డివిజనలో మాజీ కార్పొరేటర్ రాజారావు, 29వ డివిజనలో మాజీ కార్పొరేటర్ సరిపూటి రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులు లక్ష్మీనారాయణతో కలిసి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై పలువురికి పార్టీ సభ్యత్వం చేయించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా అనంతపురం అర్బన నియోజకవర్గాన్ని తీసుకున్నారని, 10 రోజుల క్రితమే ఇక్కడ సభ్యత్వ నమోదు మొదలైందన్నారు. ఇప్పటి దాకా 10వేల మంది సభ్యత్వం తీసుకున్నారన్నారు. నెల రోజుల్లో లక్షల మందితో సభ్యత్వం పూర్తి చేసేలా నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. నాయకులు తలారి ఆదినారాయణ, గాజుల ఆదెన్న, రాయల్ మురళీ, సుధాకర్‌నాయుడు, కృష్ణకుమార్, ఫిరోజ్ అహ్మద్, నెట్టెం బాలకృష్ణ, కాకర్ల ఆదినారాయణ, సరిపూటి శ్రీకాంత, కడియాల కొండన్న పాల్గొన్నారు.
Updated Date - Oct 27 , 2024 | 12:28 AM