ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA DAGGUPATI : పారిశుధ్యలోపంపై ఎమ్మెల్యే ఆగ్రహం

ABN, Publish Date - Oct 08 , 2024 | 12:18 AM

నగర పాలక సంస్థ పరిధిలోని కమలానగర్‌లో పారిశుధ్య నిర్వహణ లోపంపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే’ పేరుతో దగ్గుపాటి ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి రోజు సోమవారం ఉదయం 7 గంటల నుంచి స్థానిక కమలానగర్‌లో పర్యటించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

MLA Daggupati inspecting sewage on the road at the market

‘మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే’ కార్యక్రమానికి శ్రీకారం

తొలిరోజు కమలానగర్‌లో దగ్గుపాటి పర్యటన

అనంతపురం అర్బన, అక్టోబరు 7: నగర పాలక సంస్థ పరిధిలోని కమలానగర్‌లో పారిశుధ్య నిర్వహణ లోపంపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే’ పేరుతో దగ్గుపాటి ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి రోజు సోమవారం ఉదయం 7 గంటల నుంచి స్థానిక కమలానగర్‌లో పర్యటించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సం క్షేమ పథకాలు అందుతున్నాయో.. లేదో... తెలుసుకున్నారు. పారిశుధ్య నిర్వ హణ లోపంపై ఎక్కువ మంది ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. రోడ్డుపై ఎక్కడ చూసినా చెత్తాచెదారం, డ్రైనేజీ మురుగు ఉండటంపై సంబంధిత అధికారుల పై ఎమ్మెల్యే మండిపడ్డారు.


కమలానగర్‌లో ఇంత సమస్యగా ఉంటే నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారని నిలదీశారు. ఎక్కడా పారిశుధ్య సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, పరిష్కరించేందుకే మీ ఇంటికి - మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పథ కాలు, ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. నగ రంలో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని, దీనికి ఏకైక పరిష్కారం అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ మాత్రమే అన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన డీపీ ఆర్‌లు సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర కమీషనర్‌ నాగరాజు, టీడీపీ నాయకులు సరిపూటి రమణ, దాడి మలి ్లకార్జున, నెట్టెం బాలకృష్ణ, చంద్ర, రమేష్‌, రమణ, మణెమ్మ, ఫిరోజ్‌ అహ్మద్‌, బీజేపీ నాయకురాలు లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 08 , 2024 | 12:18 AM