AP News: విమానాశ్రయంలోకి వైసీపీ నేతలను తీసుకెళ్లేందుకు ఎమ్మెల్సీ ఇక్బాల్ చేసిన ఫీట్లు చూస్తే...
ABN, Publish Date - Jan 23 , 2024 | 05:15 PM
Andhrapradesh: పుట్టపర్తి విమానాశ్రయం బయట ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు (MLC Iqbal) చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయంలోకి వైసీపీ నేతలను తీసుకెళ్లేందుకు ఎమ్మెల్సీ ఇక్బాల్ చేసిన ప్రయత్నాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.
శ్రీసత్యసాయి జిల్లా, జనవరి 23: పుట్టపర్తి విమానాశ్రయం బయట ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు (MLC Iqbal) చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయంలోకి వైసీపీ నేతలను తీసుకెళ్లేందుకు ఎమ్మెల్సీ ఇక్బాల్ చేసిన ప్రయత్నాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. తనతో పాటు పలువురు వైసీపీ నేతలను విమానాశ్రయంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేసి చివరకు ఒంటిరిగానే ఎమ్మెల్సీ ఎయిర్‌పోర్టులోకి వెళ్లారు. వైసీపీ నేతలను లోనికి తీసుకెళ్లేందుకు విమానాశ్రయం బయట ఎమ్మెల్సీ చేసిన ఫీట్లను చూసి ఆ పార్టీ నేతలే సెటైర్లు వేసే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఎమ్మెల్సీ ఏం చేశారు?.. ఎవరెవరికి ఫోన్ చేశారో చూద్దాం..
మంగళవారం ఎమ్మెల్సీ ఇక్బాల్.. కొంత మంది వైసీపీ నేతలతో కలిసి పుట్టపర్తి విమానాశ్రయానికి వచ్చారు. ఈ క్రమంలో తనతో వచ్చిన వైసీపీ నేతలను విమానాశ్రయంలోకి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్సీ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అందుకు పోలీసులు నిరాకరించారు. అధికారులు ఇచ్చిన లిస్టులో ఉన్న వారిని మాత్రమే విమానాశ్రయంలోకి అనుమతి ఇస్తామంటూ పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఈ విషయంపై ఆర్డీవోకు ఎమ్మెల్సీ ఇక్బాల్ ఫోన్ చేశారు. చౌడేశ్వరి, దుర్గామాత, అమ్మ తల్లి అంటూ ఆర్డీవో భాగ్యరేఖను ఎమ్మెల్సీ వేడుకున్నారు. అయినప్పటికీ ఆర్డీవో భాగ్యరేఖ అనుమతి నిరాకరించారు.
దీంతో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా అక్కడి నుంచి కూడా నిరాశే ఎదురైంది. ప్రజా ప్రతినిధులను మాత్రమే అనుమతిస్తామంటూ ఎమ్మెల్సీ రిక్వెస్ట్‌ను కలెక్టర్ తోసిపుచ్చారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులను గడ్డం పట్టుకుని మరీ లోనికి అనుమతించాలంటూ ఎమ్మెల్సీ ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ అనుమతిచ్చేది లేదంటూ పోలీసులు సున్నితంగా తిరస్కరించారు. ఇక చేసేదేమీ లేక ఎమ్మెల్సీ ఇక్బాల్ విమానాశ్రయంలోకి వెళ్లిపోయారు. అయితే ఒకప్పుడు పోలీస్ బాస్‌గా ఉన్న ఇక్బాల్‌కు ఎలాంటి కష్టం వచ్చిందంటూ విమానాశ్రయం వద్ద వైసీపీ నేతలే సెటైర్లు విసరడం ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 23 , 2024 | 05:19 PM