ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA'S BIRTHADAY: ప్రజల సేవకే నా జీవితం అంకితం

ABN, Publish Date - Aug 10 , 2024 | 11:56 PM

ప్రజల సేవకే నా జీవితం అంకితమని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల నడుమ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. శనివారం స్థానిక శ్రీనగర్‌ కాలనీలోని అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

MLA Daggupati Prasad cutting the cake, Sudhakar Naidu and Royal Murali giving greetings

ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌

పార్టీ నాయకుల నుంచి శుభాకాంక్షల వెల్లువ

అనంతపురం అర్బన, ఆగస్టు 10: ప్రజల సేవకే నా జీవితం అంకితమని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల నడుమ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. శనివారం స్థానిక శ్రీనగర్‌ కాలనీలోని అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొందరు పుష్పగుచ్ఛాలు, పెన్నులు, పుస్తకాలు అం దజేయగా.. మరికొందరు భారీ గజమాలలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య ఎమ్మెల్యే భారీ కేక్‌ను కట్‌ చేశారు. పలువురు నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదానం చేసిన వారిని ఎమ్మెల్యే అభినందించారు. అనంతపురం అర్బన పరిధిలోని పలు ప్రాంతాల్లో స్థానిక నాయకులు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతపురం ప్రభుత్వాస్పత్రి వద్ద అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనపై ప్రజలు, కార్యకర్తలు చూపుతున్న అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని, ఈ జీవితం ప్రజలకే అంకితమన్నారు. తనపై ఇంత అభిమానాన్ని చూపుతున్న కార్యకర్తలు, ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. సీఎం చంద్రబాబు సహకారంతో తనకు శక్తి ఉన్నంత వరకు ప్రజలు సేవ చేస్తానన్నారు. తన పుట్టిన రోజును పురష్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా 10వేల మొక్కలు నాటుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మాజీ మేయర్‌ స్వరూప, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గాజుల ఆదెన్న, అనంతపురం అర్బన బ్యాంక్‌ చైర్మన జేఎల్‌ మురళీధర్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు తలారి ఆదినారాయణ, బుగ్గయ్యచౌదరి, రాయల్‌ మురళీ, నాయకులు గంగారామ్‌, కొండవీటి సుధాకర్‌ నాయుడు, కూచి హరి, తాజుద్దీన, సుధాకర్‌ యాదవ్‌, చంటి, గుర్రం నాగభూషణం, దళవాయి వెంకటనారాయణ, విశాలాక్షి, జోగి రాజేంద్ర, రాంప్రసాద్‌, తమ్మినేని వేణుగోపాల్‌, రామకృష్ణ రాయల్‌, పీఎం లక్ష్మీప్రసాద్‌, కుంచెపు వెంకటేష్‌, నెట్టెం బాలకృష్ణ, సిమెంట్‌ పోలన్న పాల్గొన్నారు.


10వ డివిజనలో... : నగరంలోని 10వ డివిజనలో టీఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడు పోతుల లక్ష్మీనరసింహులు ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే దగ్గుపాటి జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి కేక్‌ కట్‌ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు దూదేకుల బాబు, గోపాల్‌, కడియాల కొండన్న, కుమ్మర మధు పాల్గొన్నారు.

శుభాకాంక్షలు తెలిపిన ఓంకార్‌రెడ్డి: ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌కు తెలుగు యువత నాయకుడు ఓంకార్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం స్థానిక శ్రీనగర్‌ కాలనీలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేకు గౌతమబుద్ధుడి ప్రతిమను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీనరసింహ, ఇస్మాయిల్‌, ఆది, ఇబ్రహీం, వలి, శ్రావణ్‌, మనోహర్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.

పాతూరు ప్రభుత్వాస్పత్రి వద్ద అన్నదానం: ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ జన్మదినాన్ని పురష్కరించుకొని శనివారం స్థానిక పాతూరు ప్రభుత్వాస్పత్రి వద్ద టీడీపీ నాయకులు రవి కుమార్‌ రాయల్‌, చొప్ప రామకృష్ణ అన్నదానం చేశారు.


పడుచూరి శివకుమార్‌ శుభాకాంక్షలు: ఎమ్మెల్యేకు షిరిడిసాయి స్వీట్స్‌ అండ్‌ బేకర్స్‌ అధినేత పడుచూరి శివకుమార్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం స్థానిక శ్రీనగర్‌ కాలనీలోని అర్బన టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

పేద మహిళలకు చీరల పంపిణీ: ఎమ్మెల్యే పుట్టిన రోజును పురస్కరించుకొని శనివారం స్థానిక మున్నా నగర్‌లో టీడీపీ నాయకులు రమేష్‌ రాయల్‌, మధు రాయల్‌ ఆధ్వర్యంలో 500 మందికిపైగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గురుమూర్తి, రవికుమార్‌, రాము, తరుణ్‌, శ్రీదేవి, నిర్మల, వలి, మధు, రుషివర్ధన, వినోద్‌, జిలాన, సుదర్శన, రేవంత, శివ, బాబావలి పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2024 | 11:56 PM

Advertising
Advertising
<