ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Crime : అయ్యో.. దేవుడా..!

ABN, Publish Date - Sep 04 , 2024 | 11:34 PM

వారం రోజుల్లోనే భర్త, కుమారుడు జ్వరంతో మృతి చెందడంతో ఆ ఇల్లాలు కన్నీరు మున్నీరుగా విలపించడం చూపరులకు సైతం కంటతడి పెట్టించింది. గార్లదిన్నె మండ లం ఇల్లూరుకు చెందిన వన్నూరుస్వామి(40) ఆయన కుమారుడు అబ్దుల్లా(15) వారం రోజుల కిందట జ్వరంతో బాధపడుతూ స్థానిక ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకు న్నారు. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు గత నెల 31న చికిత్సకోసం జిల్లా సర్వజన ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు వన్నూరుస్వామి పరిస్థితి సీరియ్‌సగా ఉందని చెప్పడంతో అదేరోజు రాత్రి నగరంలోని ఓప్రైవేటు ఆస్పత్రికి ..

Rameja is in tears

మొన్న భర్త... నేడు కుమారుడు

ప్రాణాలు తీసిన పాడు జ్వరం

కన్నీరుమున్నీరైన బాధితురాలు రమీజ

అనంతపురం టౌన, సెప్టెంబరు 4: వారం రోజుల్లోనే భర్త, కుమారుడు జ్వరంతో మృతి చెందడంతో ఆ ఇల్లాలు కన్నీరు మున్నీరుగా విలపించడం చూపరులకు సైతం కంటతడి పెట్టించింది. గార్లదిన్నె మండ లం ఇల్లూరుకు చెందిన వన్నూరుస్వామి(40) ఆయన కుమారుడు అబ్దుల్లా(15) వారం రోజుల కిందట జ్వరంతో బాధపడుతూ స్థానిక ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకు న్నారు. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు గత నెల 31న చికిత్సకోసం జిల్లా సర్వజన ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు వన్నూరుస్వామి పరిస్థితి సీరియ్‌సగా ఉందని చెప్పడంతో అదేరోజు రాత్రి నగరంలోని ఓప్రైవేటు ఆస్పత్రికి


తరలించారు. అక్కడ పరిస్థితి మరింత విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తుండగా ఈనెల 1న మార్గమధ్య లోనే మృతి చెందాడు. కుమారుడు అబ్దుల్లా జిల్లాసర్వజనాస్పత్రిలోని ఐసీయూ లోనే చికిత్స పొందుతూ వచ్చారు. అయితే పరిస్థితి విషమించి బుధవారం అబ్దుల్లా కూడా ప్రాణాలు వదిలాడు. దీంతో తల్లి రమీజ గుండెలవిసేలా రోదించింది. మొన్న మొగుడు, ఇపుడు ఉన్న ఒక్కగానొక్క కొడుకును దూరం చేశావు. దేవుడా నేనేమి ఖర్మ చేశాను. నాకెందుకీ శిక్ష అంటూ రోదించడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.

శ్రద్ధ చూపింటే బతికి ఉండేవాడేమో..!

డెంగీ జ్వరంతో అబ్దుల్లా తండ్రి వన్నూరుస్వామి చనిపోయినట్లు ప్రచారం వచ్చింది. అదే జ్వరంతోనే అబ్దుల్లా కూడా ఆస్పత్రిలో ఇబ్బంది పడుతున్నాడని ఇదే విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైంది. జిల్లా ఆస్పత్రిలోని ఐసీయూలో ఉన్నా డాక్టర్లు సక్రమంగా పట్టించుకోదంటున్నారని, ఇప్పటికే తండ్రి చనిపోయాడని, కనీసం ఆ పిల్లవాడికైనా సరైన వైద్యం అందేలా చూడాలని డీఎంహెచఓ, డీఎంఓల దృష్టికి ‘ఆంధ్రజ్యోతి’ తీసికెళ్లింది. తాము వెళ్లి పరిశీలించి సరైనవైద్యం అందేలా చూస్తామని వారు పేర్కొన్నారు. కానీ ఆస్పత్రి వైపుకూడా వెళ్లలేదు, కనీసం ఎట్లా ఉందని కూడా ఆరా తీయలేదని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు కాస్త శ్రద్ధ చూపి ఉంటే అబ్దుల్లా బతికి ఉండేవాడని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 04 , 2024 | 11:34 PM

Advertising
Advertising