SUPPLEMENTARY TESTS : సప్లిమెంటరీ పరీక్షలకు ఓకే..!
ABN, Publish Date - Apr 30 , 2024 | 12:27 AM
డిగ్రీలో సబ్జెక్టులు మిగిలిపోయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఎస్కేయూ యాజమాన్యం నిర్ణయించింది. దీంతో పరీక్షల కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఊరట లభించింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సప్లిమెంటరీ పరీక్షలకు కొర్రీలు పెడుతూ వచ్చింది. దీంతో డిగ్రీ విద్యార్థులు ఫెయిల్ అయిన ఎస్కేయూ విద్యార్థులు సబ్జెక్టులను పూర్తిచేసుకోలేకపోయారు. ఈ సమస్యపై ఆంధ్రజ్యోతిలో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. అప్పటి వీసీ రామకృష్ణారెడ్డి తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆయన వైసీపీ నాయకుడి తరహాలో ...
దిగివచ్చిన ఎస్కేయూ యాజమాన్యం
అనంతపురం సెంట్రల్, ఏప్రిల్ 29: డిగ్రీలో సబ్జెక్టులు మిగిలిపోయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఎస్కేయూ యాజమాన్యం నిర్ణయించింది. దీంతో పరీక్షల కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఊరట లభించింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సప్లిమెంటరీ పరీక్షలకు కొర్రీలు పెడుతూ వచ్చింది. దీంతో డిగ్రీ విద్యార్థులు ఫెయిల్ అయిన ఎస్కేయూ విద్యార్థులు సబ్జెక్టులను పూర్తిచేసుకోలేకపోయారు. ఈ సమస్యపై ఆంధ్రజ్యోతిలో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. అప్పటి వీసీ రామకృష్ణారెడ్డి తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆయన వైసీపీ నాయకుడి తరహాలో
వ్యవహరిస్తున్నారని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు సైతం నిర్వహించాయి. అయినా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేది లేదని ఆయన మొండికేశారు. ఆ తరువాత ఇనచార్జి వీసీగా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ సుధాకర్ దృష్టికి ఈ సమస్యను కళాశాలల యాజమాన్యాలు తీసుకువెళ్లాయి. అయన స్పందించి, పరీక్షల నిర్వహణ దిశగా అడుగులువేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో బాధిత విద్యార్థుల ప్రభావం ఉంటుందని భావించిన వైసీపీ ప్రభుత్వం.. పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించారు. వీసీ హుస్సేనరెడ్డి, రిజిస్ర్టార్ ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్య ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన ప్రొఫెసర్ జీవీ రమణ అధ్యక్షతన సోమవారం ముఖ్య సమావేశాన్ని నిర్వహించి,
ఒక కమిటినీ ఏర్పాటు చేశారు. 1994-95 నుంచి 2014-15 బ్యాచల విద్యార్థులకు సంవత్సర పరీక్షలు, 2015-16 నుంచి 2018-19 బ్యాచ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు కమిటీ ఆమోదం తెలిపిందని వీసీ వెల్లడించారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ, బీబీఎతోపాటు ఇతర కోర్సులలో సబ్జెక్టులు మిగిలిపోయిన వారందరికీ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సంవత్సర పరీక్షల విద్యార్థులకు ఆఫ్‌లైన, సెమిస్టర్ పరీక్షల విద్యార్థులకు ఆనలైన ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. విద్యార్థులు తాము చదివిన కాలేజీలలోగాని, యూనివర్సిటీలోగాని దరఖాస్తులను అందజేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. కమిటీ సభ్యులు రామగోపాల్, రామకృష్ణ, జయరామిరెడ్డి, సీఈ శ్రీరాములు నాయక్ సమావేశంలో పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Apr 30 , 2024 | 12:27 AM