ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Land : ఎకరాకు లక్ష ఇస్తే చాలు..!

ABN, Publish Date - Sep 04 , 2024 | 11:30 PM

రోడ్డు పక్కన ఖాళీ భూమి కనబడితే చాలు రియల్టర్లు పాగా వేస్తున్నారు. వ్యవసాయ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. ఆ భూముల్లో వంక నారవలు ఉన్నా, కుంటలు ఉన్నా పూడ్చేసి, ప్లాట్లు వేసి విక్రయానికి సిద్ధం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా సుమారు 40 ఎకరాలకు పైగా భూమిలో రియల్టర్లు వెంచర్లు వేశారు. ఎకరానికి లక్ష రూపాయల చొప్పున ఇస్తే చాలు అధికారులు చూసీచూడనట్లు ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే మండలంలోని వ్యవసాయ ...

A scene where Kunta is buried and plotted

వ్యవసాయ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌

ఎనఓసీలు రాకున్నా ప్లాట్లు వేసుకోవచ్చు

ఎకరాకు రూ.లక్ష పుచ్చుకుంటున్న అధికారులు

వంక నారవలు, కుంటలు పూడ్చేస్తున్న రియల్టర్లు

పుట్లూరు, సెప్టెంబరు 4: రోడ్డు పక్కన ఖాళీ భూమి కనబడితే చాలు రియల్టర్లు పాగా వేస్తున్నారు. వ్యవసాయ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. ఆ భూముల్లో వంక నారవలు ఉన్నా, కుంటలు ఉన్నా పూడ్చేసి, ప్లాట్లు వేసి విక్రయానికి సిద్ధం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా సుమారు 40 ఎకరాలకు పైగా భూమిలో రియల్టర్లు వెంచర్లు వేశారు. ఎకరానికి లక్ష రూపాయల చొప్పున ఇస్తే చాలు అధికారులు చూసీచూడనట్లు ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే మండలంలోని వ్యవసాయ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరుగుతున్నా ఏ ఒక్క అధికారి


పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలో గాండ్లపాడు, పోతిరెడ్డిపల్లి, పుట్లూరు, ఏ. కొండాపురం, నాగిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో వ్యవసాయ భూములను ప్లాట్లుగా వేస్తున్నారు. గాండ్లపాడు రెవెన్యూలో ఐదుచోట్ల, పుట్లూరు రెండుచోట్ల, ఏ. కొండాపురంలో ఒకచోట, నాగిరెడ్డిపల్లి శివారులోని బస్టాప్‌ వద్ద వెంచర్లు వేశారు. ఈ వెంచర్లలో చాలాచోట్ల వంక నారవలు ఉన్నాయి. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదన్న నిబంధనలు ఉన్నాయి. మరోచోట తవ్విన కుంటను పూడ్చివేసి వాటిలో ప్లాట్లు వేసి విక్రయానికి సిద్ధం చేశారు. మరోచోట తారురోడ్డుదాకా వెంచర్ల హద్దులు వేశారు. ఇవన్నీ చూస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

చేతులు మారుతున్న లక్షలు

తాడిపత్రి ప్రాంతానికి సరిహద్దు గ్రామాలు కావడంతో వ్యవసాయభూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. గాండ్లపాడు, పుట్లూరు, ఏ. కొండాపురం గ్రామాల్లో ఎకరా ధర సుమారు రూ.20లక్షల నుంచి రూ.30లక్షల మేర పలుకుతోంది. దీంతో వ్యవసాయ భూములను సైతం కొందరు రియల్టర్లు కొనుగోలు చేసి ప్లాట్లుగా మారుస్తున్నారు. ఇలా మార్చాలంటే రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటితోపాటు ఎనఓసీ తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ నిబంధనలు పాటించకుండా స్థానిక అధికారులకే ఆమ్యామ్యాలు ఇచ్చి పనులు చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చేందుకు సుమారు మూడునెలల వ్యవధి అవుతుంది. కానీ స్థానిక అధికారులతో మాట్లాడుకుంటే ముచ్చటగా మూడురోజుల్లో పనులు చకచక పూర్తవుతాయన్న ఆలోచనతో ఎకరానికి లక్ష రూపాయల చొప్పున వారికి ముట్ట చెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

చక్రం తిప్పుతున్న వీఆర్వోలు

వ్యవసాయ భూముల్లో ప్లాట్లు వేసే విషయంలో ఆయా గ్రామాల పరిధిలో ఉన్న వీఆర్వోలు చక్రం తిప్పుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అప్పట్లో రియల్టర్లు కొందరు వైసీపీ నాయకులకు సన్నిహితులుగా ఉండటం, వీరికి వీఆర్వోలు వత్తాసు పలకడంతో ఎనఓసీలు లేకుండానే ప్లాట్లు వేశారని తెలిసింది. ఓ గ్రామపరిధిలో ఉన్న వీఆర్వో నేరుగా కార్యాలయంలోని ఓ అధికారితో సంప్రదింపులు జరిపి పనులు చక్కబెట్టినట్లు తెలిసింది. ఆ గ్రామపరిధిలో ఎక్కువ ప్లాట్లు ఉండటంతో కార్యాలయంలో కూడా ఆయన చెప్పిందే వేదం అన్నట్లు హవా సాగుతోంది. గతంలో పుట్లూరులో పనిచేసిన వీఆర్వోకి రియల్టర్లు పలు రూపాల్లో కానుకలు ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. ఆయన ఉద్యోగ విరమణ దగ్గర ఉండటంతో ప్రస్తుతం చేస్తున్న రెవెన్యూ విలేజ్‌లో కొండప్రాంతంలోని భూమిని పలువురు వైసీపీ నాయకులకు రాయించారన్న ఆరోపణలు ఉన్నాయి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 04 , 2024 | 11:30 PM

Advertising
Advertising