ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SP JAGADEESH: క్రీడలతో మానసికోల్లాసం

ABN, Publish Date - Dec 24 , 2024 | 12:21 AM

నిత్యం ఒత్తిడితో కూడిన విధుల్లో ఉండే పోలీస్‌ సిబ్బందికి క్రీడా పోటీలతో దేహదారుఢ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని జిల్లా ఎస్పీ జగదీష్‌ పేర్కొన్నారు.

The SP and the officers are raising peace slogans

జిల్లా ఎస్పీ జగదీ్‌షబాబు

అనంతపురం క్రైం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): నిత్యం ఒత్తిడితో కూడిన విధుల్లో ఉండే పోలీస్‌ సిబ్బందికి క్రీడా పోటీలతో దేహదారుఢ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని జిల్లా ఎస్పీ జగదీష్‌ పేర్కొన్నారు. జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే జిల్లా పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌-2024 స్థానిక పోలీస్‌ పరేడ్‌ మైదానంలో సోమవారం ఎస్పీ ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్‌ మీట్‌లో జిల్లాలోని ఏఆర్‌, స్పెషల్‌ పార్టీ విభాగాలతో పాటు ఏడు సబ్‌ డివిజన్లకు సంబంధించిన పోలీస్‌ క్రీడా బృందాలు పాల్గొన్నాయి. స్పోర్ట్స్‌ మీట్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ ప్రారంభ సంకేతంగా కాగడా(జ్యోతి) వెలిగించారు. తెల్ల కపోతాలు, బెలూన్లను ఎగురవేశారు. క్రీడా పోటీల్లో పాల్గొంటున్న బృందాలను ఎస్పీ పరిచయం చేసుకుని వారి నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ క్రీడా పోటీల్లో హోదాలు మరిచి అందరూ ఒక టీంగా కష్టించాల్సి ఉంటుందన్నారు. చిన్న పెద్ద అనే భేదాలు లేకుండా సిబ్బంది మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు. క్రీడల్లో బాగా రాణించి జిల్లా పోలీస్‌ శాఖకు మంచి పేరు తేవాలని ఎస్పీ ఆకాంక్షించారు. అనంతరం 800 మీటర్ల పరుగు, వాలీబాల్‌ క్రీడలను ఎస్పీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఆర్‌ అదనపు ఎస్పీ ఇలియాజ్‌బాషా, డీఎస్పీలు వెంకటేష్‌, రవిబాబు, రామకృష్ణుడు, ఎస్బీ సీఐలు ధరణికిషోర్‌, క్రాంతికుమార్‌, ఆర్‌ఐలు రెడ్డప్పరెడ్డి, రాముడు, సీఐలు, జిల్లా పోలీస్‌ అధికారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 12:21 AM