ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PEDDA REDDY : తాడిపత్రికి పెద్దారెడ్డి

ABN, Publish Date - Jul 21 , 2024 | 12:33 AM

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాదాపు రెండునెలల తర్వాత తాడిపత్రికి వెళ్లారు. అక్కడి పోలీ్‌సస్టేషనలో శనివారం జామీను పత్రాలను సమర్పించారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లు, రాళ్లదాడుల నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఆయన అనంతపురంలో ఉంటున్నారు. ఈ నెల 15న ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు అయింది. దీంతో జామీను పత్రాలను పోలీసులకు అందించారు. రెండు రోజుల క్రితం మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో పెద్దారెడ్డి తాడిపత్రికి రావడం ఉత్కంఠ రేపింది. శాంతిభద్రతల సమస్య ...

Peddareddy coming out with SP

అక్కడి నుంచి మళ్లీ అనంతకు..

అనంతపురం క్రైం/తాడిపత్రి, జూలై 20: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాదాపు రెండునెలల తర్వాత తాడిపత్రికి వెళ్లారు. అక్కడి పోలీ్‌సస్టేషనలో శనివారం జామీను పత్రాలను సమర్పించారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లు, రాళ్లదాడుల నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఆయన అనంతపురంలో ఉంటున్నారు. ఈ నెల 15న ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు అయింది. దీంతో జామీను పత్రాలను పోలీసులకు అందించారు. రెండు రోజుల క్రితం మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో పెద్దారెడ్డి తాడిపత్రికి రావడం ఉత్కంఠ రేపింది. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందేమోనని పోలీసులు, ప్రజలు ఆందోళన చెందారు. జామీను ప్రక్రియ ముగిశాక సీఐ నాగేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో పెద్దారెడ్డిని అనంతపురంలోని ఆయన నివాసానికి తరలించారు. అనంతరం ఎస్పీ కేవీ మురళీకృష్ణను పెద్దారెడ్డి కలిశారు. ఎస్పీ చాంబర్‌లో దాదాపు 40 నిమిషాలపాటు పెద్దారెడ్డి గడిపారు. అనంతరం


మీడియాతో మాట్లాడారు. గతంలో తాను ఫ్యాక్షన చేస్తానని అనలేదని, ప్రక్షాళన చేస్తానని చెప్పానని, కావాలంటే అప్పటి రికార్డులు చూడాలని అన్నారు. తన మాటలను మీడియా వక్రీకరించిందని ఆరోపించారు. తనను జిల్లా నుంచి బహిష్కరించడానికి మున్సిపల్‌ చైర్మనకు ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. ఎస్పీకి తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, తన సమస్యలను, జిల్లాలో పరిస్థితులను వివరించానని అన్నారు. న్యాయం చేస్తానని ఎస్పీ అన్నారని తెలిపారు. తాను ఒక్కడినే ఉండటంతో.. తనను జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏమైనా చేస్తాడనే ఉద్దేశంతో పోలీసులు భద్రత కల్పించి అనంతపురంలో వదిలిపెట్టి వెళ్లారని అన్నారు. ప్రజాస్వామ్యంలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నానని అన్నారు. తాను తాడిపత్రికి ష్యూరిటీలు ఇవ్వడానికి వెళ్లానని, హైకోర్టు ఉత్తర్వుల్లో ష్యూరిటీలు ఇచ్చిన అనంతరం 15 రోజులు తాడిపత్రికి వెళ్ళకూడదని ఉందని తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 21 , 2024 | 12:33 AM

Advertising
Advertising
<