వైసీపీ భూస్థాపితానికి ప్రజలు సిద్ధం
ABN , Publish Date - Feb 12 , 2024 | 12:05 AM
వచ్చే ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నియోజకవర్గం టీడీపీ నాయకురాలు బండారు శ్రావణిశ్రీ అన్నారు. ఆదివారం శింగనమల మండలంలోని చిన్నజలాలపురంలో బాబు ష్యూరిటీ భవిషత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

శింగనమల, ఫిబ్రవరి 11: వచ్చే ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నియోజకవర్గం టీడీపీ నాయకురాలు బండారు శ్రావణిశ్రీ అన్నారు. ఆదివారం శింగనమల మండలంలోని చిన్నజలాలపురంలో బాబు ష్యూరిటీ భవిషత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో గ్రామాలు ఏ మాత్రం అభివృద్ధి చెందలేన్నారు. టీడీపీని గెలిపించేందుకు అన్ని వర్గాల ప్రజలూ సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్యీనర్ గుత్తా ఆదినారాయణ, మాజీ జడ్పీటీసీ షాలిని, ఓబుళపతి, ధనుంజయ్య, రామాంజినేయులు, రవిశంకర్, వెంకట రమణస్వామి, వీరానారాయణ, ఈశ్యర్‌రెడ్డి, చింతబరిదొర, గుర్రం లక్ష్మినారాయణ, సత్తి, రాజశేఖర్ యాదవ్, జీసీబాబు, దండు విజయ్, రహితుల్లా, అనిల్, రమేష్ పాల్గొన్నారు.