ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA SUNITHA: ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించాలి

ABN, Publish Date - Aug 15 , 2024 | 12:13 AM

గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు పడ్డారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సకాలంలో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు.

MLA Paritala Sunitha who is receiving complaints

రాప్తాడు, ఆగస్టు 14: గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు పడ్డారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సకాలంలో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు హాజరై భూ సమస్యలు, పింఛన్లు, విద్యుత, రహదారి సమస్యలపై ఫిర్యాదులు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు వైసీపీ నాయకుల ఒత్తిళ్లతో అర్హులకు ప్రభుత్వ పథకాలు నిలిపివేశారన్నారు. అధికారుల్లో మార్పు రావాలన్నారు. బాధ్యతగా పని చేయకపోతే వారిపై చర్యలు తప్పవన్నారు. ప్రజలు అందించిన ఫిర్యాదులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. తహసీల్దార్‌ విజయకుమారి, ఎంపీడీఓ సాల్మనరాజ్‌, మండల ఇనచార్జి ధర్మవరపు మురళి, కన్వీనర్‌ కొండప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, ఎంపీటీసీ జాఫర్‌, సర్పంచులు తిరుపాలు, శీనయ్య, ఉజ్జినప్ప, గంగలకుంట రమణ పాల్గొన్నారు.


జిల్లాకు రప్పించండి..

అనంతపురం అర్బన: ఓడీపై చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ఎంపీఈఓలను తిరిగి జిల్లాకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఎంపీఈఓల సంఘం నాయకులు కోరారు. బుధవారం అనంతపురంలోని ఆమె నివాసంలో ఎమ్మెల్యే పరిటాల సునీతను ఎంపీఈఓల సంఘం రాయలసీమ జోన అధ్యక్షుడు రెడ్డిప్రసాద్‌, నాయకులు తిరుపతయ్య, భాస్కర్‌ నాయక్‌, శేషు కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను కలిశారు. నారాయణస్వామి, నాగ జ్యోతి, శ్యామల, జ్యోతి, చైత్ర, చౌడేశ్వరి, గాయత్రి, పద్మ, అపర్ణ, నిర్మల పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2024 | 12:13 AM

Advertising
Advertising
<