peruru dam పేరూరు ప్రాజెక్టుకు నీరు తెస్తాం
ABN, Publish Date - Dec 22 , 2024 | 12:06 AM
పేరూరు అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకు నీటిని తీసుకురావడమే ధ్యేయమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ప్రాజెక్టు కమిటనీ శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎమ్మెల్యే పరిటాల సునీత
రామగిరి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): పేరూరు అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకు నీటిని తీసుకురావడమే ధ్యేయమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ప్రాజెక్టు కమిటనీ శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పేరూరు, మద్దలచెరువు, గాండ్లపర్తి, తగరకుంట, పాలచెర్ల సాగునీటి సంఘాల అధ్యక్షులు పేరూరు ప్రాజెక్టు కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పేరూరుకు చెందిన కురుబ కోటే లక్ష్మీనారాయణరెడ్డిని చైర్మనగా, బోగినేపల్లికి చెందిన కెనకలపాటి లక్ష్మన్నను వైస్‌చైర్మనగా ఎన్నుకున్నారు. ఇరిగేషన శాఖ ఈఈ శ్రీనివాసులు, డీఈ ఉమామహేశ్వరరెడ్డి ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. ఎమ్మెల్యే వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేసి, అభినందించారు. గతంలో పేరూరు ప్రాజెక్టుకు వర్షపు నీరు వచ్చినా వృథా చేశారని, గేట్లు తెరిచేందుకు వెళ్లి విరగ్గొట్టారని అన్నారు. ఈ సారి పేరూరు ప్రాజెక్టు మరమ్మతు పనులు పూర్తి చేసి, హంద్రీనీవా నీటితో నింపుతామని అన్నారు. అనంతరం ప్రాజెక్టు గేట్ల మరమతు పనులకు ఆమె భూమి పూజ చేశారు. గేట్ల మరమతుల కోసం ప్రభుత్వం రూ.1.21 కోట్లు విడుదల చేసింది.
Updated Date - Dec 22 , 2024 | 12:06 AM