ROADS ; గుంతల రహదారులు
ABN, Publish Date - Sep 11 , 2024 | 12:05 AM
ఇటీవల కురిసిన వర్షాలకు పట్టణంలోని గుంతకల్లు, పత్తికొండ రహదారులు దెబ్బతిన్నాయి. వీటిపై వెళ్లాలంటే ప్ర యాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతకల్లు రోడ్డులోని ఎంబీఏ కళాశాల ఎదురుగా పెద్ద ఎత్తున గుంతలు పడ్డాయి. భారీ ఎత్తున గుంతలు పడి రోడ్డంతా ఆధ్వానంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే గుంతకల్లు రోడ్డులో గుంతను తప్పించే క్రమంలో ప్రయాణికులు ప్రమా దాలకు గురవుతున్నారు.
ప్రయాణికులకు అవస్థలు
గుత్తి, సెప్టెంబరు 10: ఇటీవల కురిసిన వర్షాలకు పట్టణంలోని గుంతకల్లు, పత్తికొండ రహదారులు దెబ్బతిన్నాయి. వీటిపై వెళ్లాలంటే ప్ర యాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతకల్లు రోడ్డులోని ఎంబీఏ కళాశాల ఎదురుగా పెద్ద ఎత్తున గుంతలు పడ్డాయి. భారీ ఎత్తున గుంతలు పడి రోడ్డంతా ఆధ్వానంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే గుంతకల్లు రోడ్డులో గుంతను తప్పించే క్రమంలో ప్రయాణికులు ప్రమా దాలకు గురవుతున్నారు. అదే విధంగా మున్సిపల్ కార్యాలయం సమీపంలో భారీ ఎత్తున పత్తికొండ రహదారి దెబ్బతిని గుంతలు పడ్డాయి. వర్షాలు కురిసినప్పుడు ఆ గుంతలలో నీరు నిలుస్తోంది. దీంతో గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక వాహనాలు ఆ గుంతల్లో పడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ప్రజలు, వాహనచోదకులు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 11 , 2024 | 12:05 AM