ELECTIONS: ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ABN, Publish Date - May 12 , 2024 | 11:38 PM
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జాయింట్ కలెక్టర్ కేతన గార్గ్ తెలిపారు. పట్టణంలోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఎన్నికల సిబ్బందికి అప్పగించే బాధ్యతలను రిటర్నింగ్ అధికారి, జేసీ ఆధ్వర్యంలో సమర్పించారు.
జాయింట్ కలెక్టర్ కేతన గార్గ్
రాయదుర్గం, మే 12: ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జాయింట్ కలెక్టర్ కేతన గార్గ్ తెలిపారు. పట్టణంలోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఎన్నికల సిబ్బందికి అప్పగించే బాధ్యతలను రిటర్నింగ్ అధికారి, జేసీ ఆధ్వర్యంలో సమర్పించారు. 2.64,352 ఓట్లకు ఎన్నికలు నిర్వహించేలా 296 కేంద్రాలను ఏర్పాటు చేసి బస్సులు, క్రూజర్లు వాహనాలలో తరలించారు. నియోజకవర్గం వ్యాప్తంగా 3,321 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టిభద్రత ఏర్పాట్లను చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన అధికారులు ఉదయం నుంచి మండుటెండల్లో పడిగాపులు కాశారు.
అసౌకర్యాల మధ్య సామాగ్రి పంపిణీ: అసౌకర్యాల నడుమ ఎన్నికల సామగ్రి పంపిణీ జరిగింది. దీంతో ఎన్నికల విధులకు హాజరైన ప్రిసైడింగ్ అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం పెదవి విరిచారు. పట్టణంలోని మోడల్ స్కూల్ వద్ద నుంచి ఆయా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తీసుకెళ్లేందుకు వచ్చిన ప్రిసైడింగ్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఈవీఎంలు: పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం మిషన్లను ఆదివారం రాత్రి చేరుకున్నాయి. విధుల నిర్వహణ కోసం అవసరమైన బస్సులు, జీపులను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి వాటిలో సాయంత్రం 6 గంటల కల్లా ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. రిటర్నింగ్ అధికారి కరుణకుమారి పాటు సహాయక రిటర్నింగ్ అధికారులు ఉదయం నుంచి విధుల్లో నిమగ్నమయ్యారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవోలు, ఏపీవోలతో పాటు జోన్, రూట్ అధికారులు జూనియర్ కళాశాల మైదానంలోకి చేరుకున్నారు. తెల్లవారుజామున 5.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించి ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన సామగ్రిని పంపిణీ చేశారు.
రాయదుర్గంరూరల్: మండలంలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి అయినట్లు ఆర్‌ఓ కరుణకుమారి తెలిపారు. మండలంలో 39 పోలింగ్‌బూతలకు గాను 34,548 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నట్లు తెలిపారు.
ఉరవకొండ: నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గం డీఆర్సీ(డిస్ర్టిబ్యూషన రిసెప్షన సెంటర్)ను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకే పీవో, ఏపీవోలు, ఓపీవోలకు కేటాయించిన కౌంటర్‌లో రిపోర్ట్ చేశారు. 32 కౌంటర్ల ద్వారా ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రిని ఈవీఎంలు పంపిణీ చేశారు. మధ్యాహ్నానికి డీఆర్సీ కేంద్రం నుంచి అన్ని పోలింగ్ కేంద్రాల అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. పంపిణీ ఏర్పాట్లను ఆర్వో, జేసీ కేతనగార్గ్ పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 263పోలింగ్ కేంద్రాలకు సంబంధించి సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అందజేశామన్నారు. ఎన్నికలకు 2800మంది సిబ్బందిని నియమించామన్నారు. పోలింగ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని కేంద్రాల వద్ద నిఘా ఏర్పాటు చేస్తుండగా, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించే దిశగా అదనపు బలగాలను మోహరిస్తున్నారు. 1200 మంది పోలీ్‌సఅధికారులు, సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. మొత్తం 150 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
గుంతకల్లుటౌన: సార్వత్రిక ఎన్నిలలో భాగంగా సోమవారం జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. స్ధానిక మార్కెట్ యార్డులో ఆదివారం ఈవీఎం, వీవీప్యాడ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్వో శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఈవీఎం, వీవీప్యాడ్‌లతో ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు పోలీస్ బందోబస్తు మధ్య బస్సుల్లో తరలించారు. నియోజకవర్గం మొత్తం 2,70,648 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
బొమ్మనహాళ్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సోమవారం పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో మండలంలో పోలింగ్‌స్టేషనలలో అధికారులు ఏర్పాట్లను సర్వం సిద్ధం చేఽశారు. మండల వ్యాప్తంగా 58 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఓటర్లు 46,680 ఓటర్లు తహసీల్దార్ రామాంజినమ్మ తెలిపారు.
పుట్లూరు: మండలంలో ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు మల్లికార్జునస్వామి తెలిపారు. 39పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మండలంలో 31005మంది ఓటర్లు ఉండగా పురుషులు 15625, స్ర్తీలు 15380 మంది ఉన్నారు. ఎన్నికలకు ఐదుగురు రూట్‌ఆఫీసర్లు, 300మంది ఎన్నికల సిబ్బందిని నియమించినట్లు ఆయన తెలిపారు.
యల్లనూరు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర బలగాలతో కలిపి పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌ఐ గిరిబాబు తెలిపారు. మండలంలో ఏడు గ్రామాలను అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించామన్నారు. యల్లనూరు, వెన్నపూసపల్లి, ఆరవేడు, నీర్జాంపల్లి, దంతలపల్లి, తిమ్మంపల్లి, బొప్పేపల్లి గ్రామాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాడిపత్రిటౌన: ఎన్నికలకు సంబంధించి బందోబస్తు కోసం భారీగా పోలీసు బలగాలను ఏర్పాటుచేశారు. తాడిపత్రి ప్రాంతం సమస్యాత్మకం కావడంతో పోలీసు అధికారులు కేంద్రబలగాల సాయంతో తాడిపత్రిని తమ అధీనంలోకి తీసుకున్నారు. నియోజకవర్గానికి సంబంధించి 272 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 86 సమస్యాత్మకంగా ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం స్థానిక పోలీసులతోపాటు ఇండియనఆర్మీ, బీఎ్‌సఎఫ్, సీఆర్పీఎఫ్, కర్ణాటక పోలీసులు దాదాపు 4వేలమంది విధుల్లో పాల్గొననున్నారు.
గుమ్మఘట్ట: మండలంలోని వివిధ గ్రామాలలో నిర్వహించే ఎన్నికలకు ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. 45 పోలింగ్ కేంద్రాలలో 39,908 ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
బెళుగుప్ప: మండలంలో సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అధికారులు సర్వం సిద్దం చేశారు. పండుగలా జరుపుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద ముగ్గులు వేశారు. 36,836 మంది ఓటర్లు వుండగా 43 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించనున్నారు. 430 పోలింగ్ సిబ్బంది పాల్గొంటారని తహసీల్దార్ హరినాథరావు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 144 సెక్షన అమలు చూసి ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌ఐ శివ తెలిపారు. మండలంలోని తగ్గుపర్తి, వెంకటాద్రిపల్లి, కోనాపురం, బెళుగుప్ప ఉన్నత పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాలలో కేంద్ర బలగాల సిబ్బందితో నిర్వహించనున్నారు.
డీ.హీరేహాళ్: మండల వ్యాప్తంగా 16 పంచాయతీలకు 43 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మండల వ్యాప్తంగా 36,853 ఓటర్లు ఉన్నారు. గ్రామాలలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈవీఎంల పంపిణీ కేంద్రం తనిఖీ
కళ్యాణదుర్గంరూరల్: కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంల పంపిణీ కేంద్రాన్ని జిల్లా పరిషత సీఈవో వైఖోమ్ నిదియాదేవి ఆదివారం తనిఖీ చేశారు. ఈవీఎంలు పకడ్బందీగా పోలింగ్ కేంద్రాలకు తరలించాలని సూచించారు. పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు, టాయిలెట్స్, విద్యుత సౌకర్యాలు, తాగునీరు, భోజన ఏర్పాట్లు తదితర సౌకర్యాలపై ఆరా తీయాలన్నారు.
బ్రహ్మసముద్రం: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహణకు పోలింగ్ కేంద్రాలను పూర్తిస్థాయిలో ఏర్పాట్లను అధికారులు సర్వం సిద్దం చేశారు. మౌళిక సదుపాయాల కల్పన, పోలింగ్ సిబ్బంది ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంపీడీవో దాసా నాయక్ తెలిపారు. అలాగే మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కేంద్ర బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ పరశురాముడు తెలిపారు.
కణేకల్లు: మండల వ్యాప్తంగా సోమవారం జరిగే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తహసీల్దార్ ఇందిరాదేవి తెలిపారు. మొత్తం 62 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 52,126 మంది ఓటర్లు ఉండగా పురుషులు 25,696, మహిళలు 25426తో పాటు మరో నలుగురు ట్రాన్సజెండర్లు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షనను అమలు పరచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు
కళ్యాణదుర్గంరూరల్: నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను ఎన్నికల పరికరాలను ఆయా పోలింగ్ కేంద్రాల అధికారులకు అందజేసి బస్సుల్లో పంపించారు. సోమవారం జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని మండలాల ఏఆర్‌వోలు తహసీల్దార్లు, 20 మంది కంట్రోల్ రూమ్ సిబ్బంది, 15 మంది సాంకేతిక సిబ్బంది, 251 పీవోలు, 261 ఏపీవోలు, 1044 ఓపీఓలు, 44 వీడియో గ్రాఫర్లు, 45 నాక్ అబ్జర్వర్లు, 25 సెక్టర్ ఆఫీసర్లు, 25 రూట్ ఆఫీసర్లు, 261 ఏఎనఎంలు, ఆశా వర్కర్లు, 261 బీఎల్‌వోలు, 25 సెక్షర్ పోలీస్ ఆఫీసర్‌లు, 3 బెల్ ఇంజనీర్లు, ఎనిమిది సెక్షన్ల సీఏపీఎ్‌ఫలు, రాష్ట్ర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పీఈఎంఎస్, సమర్త్ లాంటి అప్లికేషనల ద్వారా లైవ్ ట్రాకింగ్‌తో పాటు 261 పోలింగ్ కేంద్రాలకు వెబ్ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్‌వో రాణి సుశ్మిత తెలిపారు. ఎస్‌వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న 125 ఎనఎ్‌సఎ్‌స వలంటీర్ల సేవలను నియోజకవర్గ పరిశీలకులు అజయ్‌నాథ్, జడ్పీసీఈవో వైఖోమ్ నిదియా దేవి ప్రశంసించారు.
Updated Date - May 12 , 2024 | 11:38 PM