ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA SHRAVNISHREE : నియోజకవర్గం అభివృద్ధికి నిధులివ్వండి

ABN, Publish Date - Nov 21 , 2024 | 12:20 AM

నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్ర బాబుకు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వినతి పత్రం అందజేశారు. బుధవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్ర బాబును ఎమ్మెల్యే కలసి నియోజక వర్గంలోని ముఖ్యమైన సమస్యలపై వివరించారు.

MLA giving petition to CM

ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే శ్రావణిశ్రీ వినతి

శింగనమల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్ర బాబుకు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వినతి పత్రం అందజేశారు. బుధవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్ర బాబును ఎమ్మెల్యే కలసి నియోజక వర్గంలోని ముఖ్యమైన సమస్యలపై వివరించారు. నియోజకవర్గంలోని గండికోట నుంచి పుట్టూరు వయా సు బ్బరాయ సాగర్‌ ఎత్తుపోతల పథకాని కి ఫైనాన్స క్లియరెన్స లభిస్తే దాదాపు 35వేల ఎకరాలు సాగులోనికి వస్తుందని తెలిపారు. శింగనమల మండలంలోని రాచేపల్లి సమీపంలో ఉన్న లెదర్‌ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తే దాదాపు 3000 మంది ఎస్సీ కుటుంబాలకు ఉపాఽధి లభిస్తుందన్నారు. అదే మండలంలోని 2003 సంవత్సరం నీటి ముంపునకు గురైన ఉల్లికల్లు, ఉల్లికంటిపల్లి ప్రజలను ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. బుక్కరాయసముద్రం, నార్పల, గార్లదిన్నెను కరువు మండలాలుగా ప్రకటించిన నేపథ్యంలో ఆ రైతులను ఆదుకోవాలని, ఎస్సీ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు మజురు చేయాలని ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు. దీనిపై ముఖ్యమంత్రి సానూకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 21 , 2024 | 12:20 AM