MLA SHRAVANISHREE : నియోజకవర్గం అభివృద్ధికి నిధులివ్వండి
ABN, Publish Date - Nov 22 , 2024 | 12:36 AM
నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సంబంధిత మంత్రులకు విన్నవించా రు. ఆమె గురువారం అసెంబ్లీ సమావేశం అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దనరెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, దేవదాయ శాఖ మంత్రి అనం నారాయనరెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో అ శాఖలకు సంబంధించిన సమస్యలను వారికి వివరించారు.
నియోజకవర్గం అభివృద్ధికి నిధులివ్వండి
మంత్రులను కోరిన ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ
శింగనమల, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సంబంధిత మంత్రులకు విన్నవించా రు. ఆమె గురువారం అసెంబ్లీ సమావేశం అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దనరెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, దేవదాయ శాఖ మంత్రి అనం నారాయనరెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో అ శాఖలకు సంబంధించిన సమస్యలను వారికి వివరించారు. నియోజకవర్గంలో చాల కాలనీల్లో పేదలకు ఇంటి పట్టాలు ఇవ్యాలని తెలిపారు. అలాగే ఉల్లికల్లు, ఉల్లికంటిపల్లి గ్రామస్థులకు ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ కింద నిధు లు మంజురు చేయాలని కోరారు. బీసీ, ఎస్సీ సంక్షేమ పాఠశాలు, వసతిగృహల్లో మౌలిక సదుపాయలకు నిధులు ఇవ్యాలని కోరారు. అలాగే కుళ్లాయిస్వామి కొలువుదీరిన గూగూడు ను పుణ్యక్షేత్రంగా గుర్తించి ఆలయం అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేయాలన్నారు అలాగే నియోజకవర్గంలోని కరువు మండలాలకు కేంద్ర, రాష్ట్ర నిధులను కేటాయించాలని, అలాగే సాగు, తాగు నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ వినతులపై ఆయా మంత్రులు సానూకూలంగా సృందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Nov 22 , 2024 | 12:37 AM