Bellary Raghava : మానవతా కళాప్రపూర్ణుడు రాఘవ
ABN, Publish Date - Aug 03 , 2024 | 12:06 AM
బళ్ళారి రాఘవ మానవతా కళాప్రపూర్ణుడు అని వక్తలు కొనియాడారు. ఆయన 144వ జయంతిని పురస్కరించుకుని లలితకళా పరిషత్‌లో శుక్రవారం బళ్లారి రాఘవ స్మారక పురస్కారాలను ప్రదానం చేశారు. పరిషత అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షుడు శంకరయ్య, పరిషత ప్రధాన కార్యదర్శి, న్యాయవాది గాజుల పద్మజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బళ్లారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలువురు చిన్నారులు శాస్త్రీయ నృత్యాలతో అలరించారు. తదనంతరం 2024 సంవత్సరానికి బళ్లారి ...
పురస్కారాల ప్రదానోత్సవంలో వక్తలు
బళ్లారి రాఘవకు ఘన నివాళులు
అనంతపురం కల్చరల్, ఆగస్టు 2: బళ్ళారి రాఘవ మానవతా కళాప్రపూర్ణుడు అని వక్తలు కొనియాడారు. ఆయన 144వ జయంతిని పురస్కరించుకుని లలితకళా పరిషత్‌లో శుక్రవారం బళ్లారి రాఘవ స్మారక పురస్కారాలను ప్రదానం చేశారు. పరిషత అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షుడు శంకరయ్య, పరిషత ప్రధాన కార్యదర్శి, న్యాయవాది గాజుల పద్మజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బళ్లారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలువురు చిన్నారులు శాస్త్రీయ నృత్యాలతో అలరించారు. తదనంతరం 2024 సంవత్సరానికి బళ్లారి రాఘవ స్మారక పురస్కారాలను అందజేశారు. పద్యనాటక రచయితలు పల్లేటి లక్ష్మీకులశేఖర్, మర్తాటి ఈశ్వరీగోపాల్‌కు రాష్ట్రస్థాయి, పౌరాణిక నాటక కళాకారులు దాసరి దయానంద్, పుట్లూరు సంజీవరెడ్డికి జిల్లాస్థాయి పురస్కారాలను
అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. సమాజంలో మార్పుకోసం బళ్లారి రాఘవ ప్రతిక్షణం పరితపించారని అన్నారు. తన నటనతో మహాత్మాగాంధీనే మైమరిపించారని గుర్తుచేశారు. కళాకారులను ఈ తరంవారు చిన్నచూపు చూడడం తగదని అన్నారు. నేటికీ ఎంతోమంది ఉద్యోగులు తమ ప్రవృత్తిగా కళారంగాన్ని ఎంచుకుంటున్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎస్కేయూ విశ్రాంత రిజిసా్ట్రర్ సుధాకర్‌బాబు, డాక్టర్ పతికి రమేష్ నారాయణ, కళాకారులు సంగాల నారాయణస్వామి, రామగోవింద్‌సాగర్, అస్లాంబాషా, లోకేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Aug 03 , 2024 | 12:06 AM