CPI: సీఎం జగన్ స్వరం మారింది... ఓటమి గ్రహించారు...: రామకృష్ణ
ABN, Publish Date - Feb 12 , 2024 | 12:54 PM
అనంతపురం జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వరం మారిందని.. ఓటమి గ్రహించారని.. అందుకే వైసీపీ అభ్యర్థులను సీఎం మారుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు.
అనంతపురం జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వరం మారిందని.. ఓటమి గ్రహించారని.. అందుకే వైసీపీ అభ్యర్థులను సీఎం మారుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ను కాపీ కొడుతున్న ప్రధాని మోదీ.. బీజేపీకు 370 సీట్లు వస్తాయని ప్రచారం చేస్తున్నారని.. మోదీ, జగన్ ఇద్దురూ ఇద్దరే... పచ్చి మోసగాళ్లని.. దేశం, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. టీడీపీ.. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని సూచించారు. చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టడానికి జగన్‌కు బీజేపీ సహకరించిందని ఆరోపించారు.
దేశంలోని ప్రాంతీయ పార్టీలను ప్రధాని మోదీ విచ్చిన్నం చేస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాయకులు విచిత్రంగా పగలు ఒకరు.. రాత్రి ఒకరు మోదీని కలుస్తున్నారని అన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిని బ్లాక్‌మెయిల్ రాజకీయం చేసి అరెస్ట్ చేశారని.. ఏపీ సీఎం జగన్ రూ. లక్షలు కోట్లు దోపిడీ చేస్తే కేంద్రం పట్టించుకోదని.. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. సీఎం జగన్ మరోసారి గెలువడానికి వాలంటీర్ వ్యవస్థను నమ్ముకుందని, ఏపీలో ఓటర్ల అవకతవకలు జరగడానికి ప్రధాన కారణం కలెక్టర్, ఎస్పీలు, వైసీపీ నాయకుల ప్రమేయమేనని ఆయన అన్నారు. దొంగ ఓట్లపై కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు పిర్యాదు చేస్తామన్నారు. సీపీఐ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పట్టుకోవాలనేది మార్చి మొదటి వారంలో తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కేంద్రంలోని బీజేపీ పార్టీని ఓడించడమే తమ లక్ష్యమని, ఆ పార్టీతో పోరాడటానికి మేము సిద్ధమని.. అందుకు ఏ పార్టితోనైనా సీపీఐ కలుస్తుందని రామకృష్ణ స్పష్టం చేశారు.
Updated Date - Feb 12 , 2024 | 12:54 PM