Rayadurga will be developed i రాయదుర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తా
ABN, Publish Date - Dec 25 , 2024 | 01:13 AM
రాయదుర్గం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ చైర్‌పర్సన పొరాళ్ల శిల్ప అధ్యక్షతన బడ్జెట్ ప్రత్యేక సమావేశం జరిగింది. విప్ కాలవ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బడ్జెట్‌ను మున్సిపల్ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. అదే విధంగా సాధారణ సమావేశంలోని అజెండా అంశాలను సైతం ఏకగ్రీవంగా తీర్మానించారు.
- కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వ విప్ కాలవ
- ఏకగ్రీవంగా బడ్జెట్ ఆమోదం
రాయదుర్గంటౌన, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): రాయదుర్గం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ చైర్‌పర్సన పొరాళ్ల శిల్ప అధ్యక్షతన బడ్జెట్ ప్రత్యేక సమావేశం జరిగింది. విప్ కాలవ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బడ్జెట్‌ను మున్సిపల్ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. అదే విధంగా సాధారణ సమావేశంలోని అజెండా అంశాలను సైతం ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడారు. భవిష్యత్తు తరాలు హర్షించే విధంగా రా యదుర్గం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు. ఇందుకు సుదీర్ఘమైన ప్రణాళికతో ముందుకు వెళతామన్నారు. ఉడేగోళం నుంచి బళ్లారి బైపాస్ వరకు హాఫ్‌రింగ్ రోడ్డు నిర్మాణం పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావడంతో పాటు రాయదుర్గం పట్టణ రూపురేఖలు మారుతాయన్నారు. మున్సిపల్ పాలకవర్గంతో పాటు వ్యాపారులు , ప్రజలు సహకరిస్తే బళ్లారిరోడ్డు విస్తరణ పనులు చేపడతామన్నారు. పాత మున్సిపల్ కార్యాలయాన్ని తొలగించి దాని స్థానంలో ఆకర్షణీయమైన వాణిజ్య సముదాయ భవన నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరించడంతో పాటు వీధిదీపాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ప్రతిపాదించిన బళ్లారిరోడ్డు ప్రధాన రహదారి విస్తరణకు కౌన్సిల్ పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్‌రెడ్డి, మున్సిపల్ అధికారులు, కౌన్సిల్ సభ్యులు, కో ఆప్షన సభ్యులు, అర్బన సీఐ జయనాయక్ తదితరులు పాల్గొన్నారు.
బడ్జెట్ ఆమోదం
రాయదుర్గం పురపాలక సంఘం ఆర్థిక సంవత్సరం 2024-25నకు సవరించిన బడ్జెట్ అంచనాలను, ఆర్థిక సంవత్సరం 2025-26నకు మున్సిపల్ అధికారులు తయారుచేసిన బడ్జెట్ అంచనాలను కౌన్సిల్ పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. 2025-26 వ ఆర్థిక సంవత్సరానికి అన్ని పద్ధతుల కింద సాధారణ, మూలధన రాబడి ప్రారంభ నిలువతో సహా రాబడి ఖర్చులు కలిపి సుమారు రూ. 36.30 కోట్లతో బడ్జెట్ అంచనాను ఆమోదించారు. మొత్తం రూ. 36.30 కోట్ల అంచనాతో తయారైన బడ్జెట్‌లో రూ. 35.31 కోట్లు ఖర్చు చూపి రూ. 98.44 లక్షలు ముగింపు నిలువుగా బడ్జెట్‌లో పేర్కొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...
Updated Date - Dec 25 , 2024 | 01:13 AM