ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TUNGABADRA DAM : సంకల్పానికి సలాం!

ABN, Publish Date - Aug 17 , 2024 | 01:10 AM

తుంగభద్ర జలాశయం నిండుకుండగా మారి.. 105.78 టీఎంసీలు నిల్వ ఉండగా.. అనుకోని విపత్తు ఎదురైంది. క్రస్ట్‌ గేట్‌ల నుంచి నదిలోకి నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో.. ఈ నెల 10వ తేదీ రాత్రి సుమారు 10.30 సమయంలో 19వ క్రస్ట్‌గేట్‌ కొట్టుకుపోయింది. విషయం తెలియగానే లక్షలాది ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రైతాంగంలో ఆందోళన, నైరాశ్యం చోటు చేసుకున్నాయి. కొన్ని గంటల వ్యవధిలో ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మరీ ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ ...

అమూల్య జల సంపదను కాపాడిన నిపుణులు

తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్‌ స్థానంలో స్టాప్‌లాగ్‌

గేట్‌ తొలి ఎలిమెంట్‌ అమరిక విజయవంతం

అడ్డంకులను అధిగమిస్తూ ఒక్కో అడుగు..

పదుల సంఖ్యలో నిపుణులు.. వందకు పైగా కార్మికులు

ఈ నెల 10న కొట్టుకుపోయిన 19వ క్రస్ట్‌గేట్‌

కన్నయ్య నాయుడు నేతృత్వంలో నష్ట నివారణ

తుంగభద్ర జలాశయం నిండుకుండగా మారి.. 105.78 టీఎంసీలు నిల్వ ఉండగా.. అనుకోని విపత్తు ఎదురైంది. క్రస్ట్‌ గేట్‌ల నుంచి నదిలోకి నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో.. ఈ నెల 10వ తేదీ రాత్రి సుమారు 10.30 సమయంలో 19వ క్రస్ట్‌గేట్‌ కొట్టుకుపోయింది. విషయం తెలియగానే లక్షలాది ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రైతాంగంలో ఆందోళన, నైరాశ్యం చోటు చేసుకున్నాయి. కొన్ని గంటల వ్యవధిలో ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మరీ ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. క్రస్ట్‌గేట్‌ల విషయంలో అపార నైపుణ్యం ఉన్న కన్నయ్య నాయుడును రంగంలోకి దించింది. ఆయన సూచనలతో పక్కా ప్రణాళిక సిద్ధమైంది. వారం రోజులపాటు రేయింబవళ్లు వందలాది మంది శ్రమించారు. శుక్రవారం రాత్రి 9.10 సమయానికి అద్భుతం ఆవిష్కృతమైంది. ‘మునుముందు తలెత్తే ఇలాంటి విపత్తులకు ఇది ఒక మోడల్‌ కావాలి..’ అని కన్నయ్య నాయుడు ప్రకటించి 24 గంటలు గడవకనే.. ఆ మోడల్‌ సాకారమైంది. డ్యాం స్పిల్‌వే 1613 అడుగుల


వద్దకు తొలి స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్‌ వెళ్లి దర్జాగా కూర్చుంది. దానిపై మరో నాలుగు స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్లు ఏర్పాటు చేయడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. శనివారం సాయంత్రానికి ఈ ప్రక్రియ సంపూర్ణంగా విజయవంతం కావచ్చు. ఈ లెక్కన.. రేపటి నుంచి చుక్క నీరు వృథా కాదు. ఈ పనులు జరుగుతుండగా.. శుక్రవారం ఆకాశం కూడా హర్షం వ్యక్తం చేసింది. అప్పుడప్పుడు వర్షిస్తూ.. ‘ఏం భయంలేదు.. ఇంకా వానాకాలం ఉంది. డ్యాం మళ్లీ నిండుతుంది. మీ శ్రమ వృథా కాదు..’ అని ఉత్తేజపరిచింది.

జలం.. ఇక సురక్షితం..

క్రస్ట్‌ గేట్‌ కొట్టుకుపోయిన వారం రోజుల్లో డ్యాం నుంచి తుంగభద్ర నదిలోకి సుమారు 50 టీఎంసీల నీరు వెళ్లింది. డ్యాం క్రస్ట్‌గేట్‌ కొట్టుకుపోయిన రోజు 105.78 టీఎంసీల నిల్వలు ఉండగా.. తొలి ఎలిమెంట్‌ అమర్చే సమయానికి శుక్రవారం సుమారు 68 టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి. ఈ లెక్కన డ్యాం నిల్వల నుంచి 37.7 టీఎంసీల నీరు నదికి, కాల్వలకు వెళ్లింది. దీంతోపాటు డ్యాంలోకి గడిచిన వారం రోజులుగా 40 వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది. ఇది సుమారు 15 టీఎంసీల దాకా ఉంటుంది. మొత్తం 53 టీఎంసీల నీరు కాలువలు, నదిలోకి వెళ్లినట్లు. ఇందులో కాలువలకు 3 టీఎంసీలు అనుకున్నా.. నదిలోకి వెళ్లింది సుమారు 50 టీఎంసీలు. క్రస్ట్‌గేట్‌ కొట్టుకపోయి ఉండకపోతే.. నది, కాలువలకు పైనుంచి వచ్చి చేరుతున్న 15 టీఎంసీల వరద నీరు మాత్రమే వెళ్లేది. స్టాప్‌లాగ్‌ను ఏర్పాటు చేయకపోతే డ్యాం నుంచి స్పిల్‌ వే వరకూ (1613 అడుగులు) ఉన్న నీరు మొత్తం దిగువకు వెళ్లేది. స్పిల్‌ లెవెల్‌ వద్ద 43 టీఎంసీల నిల్వలు ఉంటాయి. ప్రస్తుతం డ్యాంలో 68 టీఎంసీలు ఉన్నందున.. నిల్వ నీటిలో 25 టీఎంసీల దాకా నిపుణులు కాపాడినట్లు. దీంతోపాటు.. ఇకపై వచ్చే వరదనీటినీ ఒడిసి పట్టుకున్నట్లు. తీవ్ర ఆందోళనకు గురైన రైతాంగానికి ఇంతకు మించిన శుభవార్త ఇంకేముంటుంది..?

(రాయదుర్గం/బళ్లారి/గాంధీనగర్‌)

గేటు ఏర్పాటు విజయవంతం

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌

అనంతపురం అర్బన, ఆగస్టు 16: తుంగభద్ర డ్యామ్‌లో 19వ గేట్‌కు సంబంధించిన మొదటి గేట్‌ను విజయవంతంగా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. 19వ గేట్‌కు సంబంధించి మొదటి గేటును విజయవంతంగా దింపిన నేపథ్యంలో శుక్రవారం రాత్రి మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. టీబీ డ్యామ్‌లో 19వ గేట్‌ కొట్టుకుపోయిన పరిస్థితుల్లో శుక్రవారం అనుకున్నది అనుకున్న ట్లుగా చాలా విజయవంతంగా గేట్‌ దింపారన్నారు. శుక్రవారం రాత్రికి రెండు, మూడు, నాలుగు గేట్లను కూడా దింపుతారని వెల్లడించారు. భారతదేశ చరిత్రలో నది నీటి ప్రవాహం ఉన్న తరుణంలో గేటు ఏర్పాటు చేయడం అనేది ఇంజనీరింగ్‌ అధికారుల సాహసోపేత చర్య అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందించారన్నారు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మన కోసం పనిచేసిన కార్మికులు, అధికారులు, కర్ణాటక ప్రభుత్వానికి జిల్లా రైతాంగం తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ రోజు రాత్రి ఎంతసేపైనా 19వ గేట్‌లో మరో రెండు, మూడు గేట్లు ఏర్పాటును పర్యవేక్షిస్తామన్నారు.

అడ్డంకులను అధిగమిస్తూ..!

19వ క్రస్ట్‌గేట్‌ స్థానంలో తాత్కాలికంగా స్టాప్‌లాగ్‌ గేట్‌ను అమర్చేందుకు కన్నయ్యనాయుడు నేతృత్వంలోని నిపుణుల బృందం శుక్రవారం ఉదయం 9 గంటలకు పనులను పునఃప్రారంభించారు. కొట్టుకుపోయిన క్రస్ట్‌గేట్‌ స్థానంలో తెగిపోయిన గేట్‌ ముక్క గైడ్‌ యాంగిల్‌ వద్ద అడ్డుగా ఇరుక్కుపోవడంతో దానిని గుర్తించి, మధ్యాహ్నానికి ఒడ్డుకు తీసుకొచ్చారు. తమిళనాడుకు చెందిన జిందాల్‌ కార్మికులు ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలోకి దిగి ఆ ముక్కను క్రేన్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. రెండురోజులుగా అక్కడున్న క్రేన్ల సామర్థ్యం తక్కువగా ఉండడంతో 90 టన్నుల కెపాసిటీ కలిగిన మరో రెండు క్రేన్లను హుటాహుటిన తెప్పించి వినియోగిస్తున్నారు. ఇప్పటికే 60 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తు ఉన్న రెండు గేట్‌ ఎలిమెంట్‌లను 19వ క్రస్ట్‌గేట్‌ వద్ద ఆనకట్టపై సిద్ధంగా ఉంచారు. వాటిలో ఒక గేట్‌ను దించేందుకు ప్రయత్నించగా క్రేన్లకు ఒక వైపు కౌంటర్‌ వెయిట్‌, మరో వైపు హాయీస్‌ ప్లాట్‌ఫాం ఆటంకం కలిగించాయి. దీంతో కన్నయ్యనాయుడు సూచన మేరకు వాటిని తొలగించారు. హాయీస్‌ ప్లాట్‌ఫారంను సాయంత్రానికి తీసి ఆనకట్టపై ఓ పక్క ఉంచేశారు. క్రస్ట్‌గేట్‌కు ముందువైపు పై భాగంలో 30 టన్నుల బరువున్న కౌంటర్‌వెయిట్‌ను జాగ్రత్తగా 1633 అడుగుల వరకు కిందకు దించారు. ఇలా.. స్టాప్‌లాగ్‌ గేట్‌ తొలి ఎలిమెంట్‌ను గైడ్‌యాంగిల్‌లో కూర్చోబెట్టేందుకు పైభాగంలో అడ్డంగా ఉండే ఆ రెండింటిని తొలగించారు. అనంతరం క్రేన్ల సాయంతో ఎలిమేట్‌ను గైడ్‌యాంగిల్‌లో అమర్చేందుకు సాయంత్రం 6 గంటల నుంచి పనులను ప్రారంభించారు. డ్యాం నుంచి క్రస్ట్‌ గేట్‌ల ద్వారా ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి వద్ద ఈ ప్రక్రియ సాగింది. అనుకోని ప్రమాదం తలెత్తితే నిపుణులు, కార్మికులను కాపాడేందుకు డ్యాం దిగువన నదిజలాలలో బోర్డు అధికారులు రెండు రెస్క్యూ టీంలను సిద్ధంగా ఉంచారు. ప్లాస్టిక్‌ పడవలలో ఈ రెండు బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.

Updated Date - Aug 17 , 2024 | 01:10 AM

Advertising
Advertising
<