SCHOOLS OPEN : బడిబాట
ABN, Publish Date - Jun 13 , 2024 | 11:11 PM
వేసవి సెలవుల తర్వాత గురువారం పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు బడిబాట పట్టారు. దీంతో పాఠశాలల ప్రాంగణాలు కిటకిటలాడాయి. పునఃప్రారంభం నేపథ్యంలో స్కూళ్లను ముస్తాబు చేశారు. విద్యార్థులకు స్వాగత తోరణాల మధ్య ఆహ్వానం పలికారు. పలు స్కూళ్లలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. స్టూడెంట్ కిట్లు సైతం ఎమ్మార్సీల నుంచి స్కూల్ పాయింట్‌కు చేరుస్తున్నారు....
తెరుచుకున్న పాఠశాలలు
ప్రభుత్వ స్కూళ్లలో పల్చగా విద్యార్థులు
20 శాతంలోపే హాజరు
ఎమ్మార్సీల నుంచి స్కూళ్లకు కిట్లు
అనంతపురం విద్య, జూన 13: వేసవి సెలవుల తర్వాత గురువారం పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు బడిబాట పట్టారు. దీంతో పాఠశాలల ప్రాంగణాలు కిటకిటలాడాయి. పునఃప్రారంభం నేపథ్యంలో స్కూళ్లను ముస్తాబు చేశారు. విద్యార్థులకు స్వాగత తోరణాల మధ్య ఆహ్వానం పలికారు. పలు స్కూళ్లలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. స్టూడెంట్ కిట్లు సైతం ఎమ్మార్సీల నుంచి స్కూల్ పాయింట్‌కు చేరుస్తున్నారు.
తొలిరోజు అరకొరగానే..
జిల్లా వ్యాప్తంగా స్కూళ్లు తెరుచుకున్నా.. చాలా వాటిలో విద్యార్థులు చాలా తక్కువగా వచ్చారు. తొలిరోజు కావడం, చిరుజల్లులు పడుతుండటంతో విద్యార్థులు తక్కువగా హాజరయ్యారు. 20 శాతం మంది మాత్రమే హాజరైనట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. జిల్లాలోని ఎమ్మార్సీల నుంచి స్టూడెంట్ కిట్లను స్కూళ్లకు మండల విద్యాశాఖాధికారులు, ఇతర సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో తరలించే పనికి శ్రీకారం చుట్టారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jun 13 , 2024 | 11:11 PM