ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ARCHERY : రాష్ట్ర స్థాయి పోటీలకు శింగనమల విద్యార్థులు

ABN, Publish Date - Oct 29 , 2024 | 11:58 PM

నియోజకవర్గ కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల విద్యార్థులు ఏడుగురు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికయ్యారు.

Shinganamala students who excelled in archery competitions

శింగనమల, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల విద్యార్థులు ఏడుగురు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికయ్యారు. అనంతపురంలో ఈ నెల 28 న నిర్వహించిన జిల్లా స్థాయి అర్చరీ పోటీల్లో బాలికల అండర్‌ - 14 విభా గంలో దాసరి హాసిని మెదటి స్థానం, అండర్‌ - 17లో ముంటిమడుగు లావణ్య రెండో స్థానం, అండర్‌ - 19 ఇండియన రౌండ్‌లో దండువారిపల్లి నిహారిక రెండో స్థానంలో నిలిచారు. అలాగే బాలికల అండర్‌ - 14 విభాగం లో ఎంపాకుల సుస్మిత మూడో స్థానం, వెన్నపూస శ్రుతి నాలుగో స్థానం, అండర్‌ -17లో బెస్త దీపిక నాలుగో స్థానం, బాలుర అండర్‌ - 19 ఇండి యన రౌండ్‌లో బోడిగానిదొడ్డి కార్తీక్‌ నాలుగో స్థానంలో నిలిచారు. వారు రా ష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీడీ నందకుమార్‌ తెలిపారు. వారిని పాఠశాల హెచఎం సూజాతమ్మ, విద్యా కమిటి చైర్మన సురేష్‌కుమార్‌, కమిటీ సభ్యులు, పీడీ, ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 29 , 2024 | 11:58 PM