ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: హిందూపురంలో వైసీపీకి షాక్‌

ABN, Publish Date - Aug 16 , 2024 | 06:57 AM

సినీనటుడు, శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో వైసీపీకి బిగ్‌షాక్‌ తగిలింది. వైసీపీకి చెందిన హిందూపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజతోపాటు ఎనిమిది మంది కౌన్సిలర్లు గురువారం బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు.

● చైర్‌పర్సన్‌సహా 8 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరిక

హిందూపురం, ఆగస్టు 15: సినీనటుడు, శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో వైసీపీకి బిగ్‌షాక్‌ తగిలింది. వైసీపీకి చెందిన హిందూపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజతోపాటు ఎనిమిది మంది కౌన్సిలర్లు గురువారం బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు పార్టీ వీడడానికి సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాకపోవడంతో వేచిచూశారు. గురువారం ఆయన నియోజకవర్గ పర్యటనకు రావడంతో ఎమ్మెల్యే నివాసంలో చైర్‌పర్సన్‌ ఇంద్రజ, కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ ఇంద్రజ మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతోనే టీడీపీలో చేరామన్నారు. మున్సిపాలిటీలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 30 మంది వైసీపీ, 6 టీడీపీ సభ్యులున్నారు. బీజేపీ, ఎంఐఎం తరఫున ఒక్కొక్కరు గెలిచారు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ఒకరు టీడీపీలో చేరారు. గురువారం 9 మంది చేరడంతో టీడీపీ బలం 19కి చేరింది. టీడీపీ చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకోవడానికి మరో కౌన్సిలర్‌ అవసరం. ఎమ్మెల్యే, ఎంపీ ఓటు కలుపుకుంటే 21కి చేరుతుంది. దీంతో చైర్మన్‌ పదవి టీడీపీ వశం కానుంది. మరికొంతమంది కూడా టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.

Updated Date - Aug 16 , 2024 | 06:59 AM

Advertising
Advertising
<