ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

mathematics గణితంలో రాణించాలి

ABN, Publish Date - Dec 22 , 2024 | 01:06 AM

ప్రతి విద్యార్థి గణితం లో రాణించాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ కేటీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన జయంతిని కళాశాల ప్రిన్సిపాల్‌ రఘురామమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

- విద్యార్థులకు విప్‌ కాలువ శ్రీనివాసులు సూచన

- శ్రీనివాస రామానుజన జయంతి సందర్భంగా ఘన నివాళి

రాయదుర్గంరూరల్‌, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రతి విద్యార్థి గణితం లో రాణించాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ కేటీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన జయంతిని కళాశాల ప్రిన్సిపాల్‌ రఘురామమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.


ముఖ్యఅతిథిగా విప్‌ కాలువ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత మాట్లాడుతూ గణిత మేధావి, అద్భుత ప్రజ్ఞావంతుడు శ్రీనివాస రామానుజన జయంతిని జాతీయ గణితదినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఆయన గణితంలో చేసిన కృషి ఎనలేనిదన్నారు. ప్రతి విద్యార్థి గణితంలో రాణించాలన్నారు. అప్పుడే ఉద్యోగావకాశాలు మెండుగా లభిస్తాయని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అధ్యాపకులు గురుమూర్తి, కిరణ్‌, ప్రసాద్‌, విజయ్‌కుమార్‌బాబు, నారాయణ, నాగప్ప తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Dec 22 , 2024 | 01:06 AM