SPORTS : ఎస్‌ఎస్‌బీఎన కబడ్డీ జట్టు హ్యాట్రిక్ విజయం
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:29 AM
కబడ్డీ పోటీల్లో ఎస్‌ఎస్‌బీఎన జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ఎస్‌ఎస్‌బీఎన కళాశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఎస్‌కేయూ అంతర్ కళాశాలల గ్రూప్-బి పోటీలు సోమవారం ముగిశాయి.. కబడ్డీ పోటీల్లో ఫైనల్ పోరు రసవత్తరంగా సాగింది.
అనంతపురం క్లాక్‌టవర్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): కబడ్డీ పోటీల్లో ఎస్‌ఎస్‌బీఎన జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ఎస్‌ఎస్‌బీఎన కళాశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఎస్‌కేయూ అంతర్ కళాశాలల గ్రూప్-బి పోటీలు సోమవారం ముగిశాయి.. కబడ్డీ పోటీల్లో ఫైనల్ పోరు రసవత్తరంగా సాగింది. ఉత్కంఠగా సాగిన కబడ్డీ పోటీల్లో ఆర్ట్స్ కళాశాల జట్టుపై ఎస్‌ఎస్‌బీఎన 30పాయింట్ల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే బాస్కెట్‌బాల్ పోటీలలో ఎస్‌ఎస్‌బీఎన జట్టు గెలుపొందగా, ఎస్‌కేయూ కాలేజీ రన్నర్‌గా నిలిచింది. షటిల్ బ్యాడ్మింటనలో ఎస్‌ఎస్‌బీఎనపై ఆర్ట్స్ కళాశాల జట్టు విజయం సాధించింది. ఓవరాల్ చాంపియనగా ఎస్‌ఎస్‌బీఎన కళాశాల నిలిచింది. ఎస్‌కే యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ జెస్సీ, కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రాజు ముఖ్య అతిథులు గా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. విజయవంతంగా పోటీలను నిర్వహించిన ఎస్‌ఎస్‌బీఎన కళాశాల పీడీ ప్రసాద్‌ను అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో శాప్ కోచలు అనీల్‌కుమార్, వంశీ, సంధ్య, పీడీలు శ్రీనివాసరెడ్డి, శ్రీరామ్, ఎస్‌ఎస్‌బీఎన కళాశాల పీడీ ప్రసాద్, పీడీలు, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Oct 22 , 2024 | 12:29 AM