ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA : పనిచేయాలంటే ఉండండి... లేదంటే వెళ్లిపోండి

ABN, Publish Date - Dec 06 , 2024 | 12:20 AM

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే పరిటాల సునీత తీ వ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ గు రువారం అనంతపురం నగరంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో మీడియాతో మా ట్లాడారు. గతంలో చెన్నేకొత్తపల్లి, రామ గిరి, రాప్తాడు మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయన్నారు.

Speaking MLA Paritala Sunitha

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు

రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే అసంతృప్తి

అనంతపురం డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే పరిటాల సునీత తీ వ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ గు రువారం అనంతపురం నగరంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో మీడియాతో మా ట్లాడారు. గతంలో చెన్నేకొత్తపల్లి, రామ గిరి, రాప్తాడు మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని పరిష్కరించాలని అధికారులకు చెప్పినా, ఇప్పటి వరకు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. గత వైసీపీ ప్రభు త్వంలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కాళ్లు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగారన్నారు. తమ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి ప్రజలకు రాకూడదనే ఉ ద్దేశ్యంతో మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామ న్నారు.


ప్రభుత్వం మారినా రెవెన్యూ అధికారుల్లో అదే ని ర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. చిన్న చిన్న సమస్యల పరిష్కా రం కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సి వస్తోందన్నారు. కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికా రుల నుంచి ఆదేశాలు వచ్చినా... కింది స్థాయి అధికారులు స్పందించడం లేదన్నారు. గతంలోలాగా నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. పనిచేయడం ఇష్టం లేకపోతే..... మ రో ప్రాంతానికి వెళ్లిపోవచ్చన్నారు. ప్రజలను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవన్నారు. భూముల విలువ పె రిగిన నేపథ్యంలో చిన్న చిన్న వివాదాలు ఏర్పడుతున్నా యన్నారు. చివరికీ అన్నదమ్ముల మధ్య ఆ వివాదాలు లేకపోలేదన్నారు. చిన్న వివాదాలే పెద్దవిగా మారక మునుపే పరిష్కారం చూపా ల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మరికొన్ని ప్రాం తాల్లో లేని సమస్యలను సృష్టిం చుకుంటున్నారని, సామ రస్య పూర్వకంగా పరిష్కరించు కోవాలని సూచించారు. నియోజకవర్గంలోని మండలాల్లో నిర్వహించే రెవెన్యూ స దస్సుల్లో అధికారుల దృష్టికి సమస్యలు తీసుకొచ్చి, పరిష్క రించుకోవాలని ప్రజలకు సూచించారు. రెవెన్యూ సదస్సుల ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 06 , 2024 | 12:20 AM