ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA : అభివృద్ధి వైపు అడుగులు..!

ABN, Publish Date - Sep 19 , 2024 | 12:09 AM

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధిని విస్మరించారు. ఎన్నికల ముందు హడావిడి చేసినా పనులు అంతంతమాత్రం గానే చేపట్టారు. ఆ పాలనకు ప్రజలు స్వ స్తి పలికారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్ప డిన వంద రోజుల్లోనే గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అందుకు అనుగుణంగా అ డుగులు పడుతు న్నాయి. మండల వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజా ప్రతి నిధులు శ్రీకారం చుట్టారు.

TDP leaders inspecting the Bhumi Puja area

రూ.5.14కోట్లతో రోడ్ల నిర్మాణం

రూ.2కోట్లతో డ్రైనేజీ ఏర్పాటు

21న భూమిపూజ చేయనున్న

ఎమ్మెల్యే పరిటాల సునీత

అనంతపురంరూరల్‌, సెప్టెంబరు 18: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధిని విస్మరించారు. ఎన్నికల ముందు హడావిడి చేసినా పనులు అంతంతమాత్రం గానే చేపట్టారు. ఆ పాలనకు ప్రజలు స్వ స్తి పలికారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్ప డిన వంద రోజుల్లోనే గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అందుకు అనుగుణంగా అ డుగులు పడుతు న్నాయి. మండల వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజా ప్రతి నిధులు శ్రీకారం చుట్టారు. మండలంలో రూ.5.04కోట్లతో సీసీ రోడ్లు, మట్టి రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. మరో రూ.2కోట్లతో డ్రైనేజీల నిర్మాణం చేపట్టనున్నారు. ఈనెల 21వతేదిన ఎమ్మెల్యే పరిటాల సునీత అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ మండల నాయకులు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.


రూ.5.14కోట్లతో సీసీ, మట్టిరోడ్లు

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మండలంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. పాపంపేట పంచా యతీలో సీసీరోడ్లకు సంబంధించి రూ.1.39కోట్లతో 22 అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఇటుకలపల్లి, చియ్యేడు గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో రూ.15లక్షలతో, ఆలమూరు రూ.20లక్షలు, కక్కలపల్లి కాలనీ రూ.43లక్షలు, కక్కలపల్లి రూ.17లక్షలు, ఆకుతోటపల్లిలో రూ.40లక్షలు, కందుకూరు పం చాయతీలోని కందుకూరు, కృష్ణంరెడ్డి పల్లిల్లో రూ.60లక్షలు, కామరుపల్లిలో రూ.10లక్షలతో సీసీరోడ్లు వేయనున్నారు. పూలకుంటలో రూ.10లక్షలు, రాచానపల్లి పంచాతీలోని రాచానపల్లి, సిండికేట్‌నగర్‌లో రూ. 32లక్షలు, సోములదొడ్డి పంచాయ తీలోని సోములదొడ్డి, పామురాయి గ్రామాల్లో రూ.31 లక్షలు, కురు గుంటలో రూ.30లక్షలు, కాట్నేకాలువలో రూ.12లక్షలు, తాటి చెర్లలో రూ.20లక్షలు, ఉప్పరపల్లిలో రూ.10లక్షలు, మన్నీలలో రూ.10 లక్షలలో సీసీ రోడ్లు వేయన్నారు. ఇవి కాక మరో రూ.2కోట్లతో ప్రతి గ్రామ పంచాయతీలో డ్రైనేజీ కాలువలు నిర్మాణం చేపట్టనున్నారు.

21న లాంఛనంగా ప్రారంభం : అభివృద్ధి పనులు ఈ నెల 21న ఎమ్మెల్యే పరిటాల సునీత చేతులమీదుగా లాంఛనంగా ప్రారంభం కానున్నా యి. ఇందుకు టీడీపీ మండల నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం కురుగుంటలో పనులను ప్రారంభించనున్నారు. ఆ తరువాత పాపంపేట, కక్కలపల్లి కాలనీ, మధ్యాహ్నం ఆకుతోటపల్లిలో పనులు ప్రారంభానికి ఎమ్మెల్యే భూమి పూజ చేయనున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 19 , 2024 | 12:09 AM

Advertising
Advertising