Share News

సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:08 AM

సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రజల్లోకి సూపర్‌స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. మండలంలోని బూదగవి, నెరమెట్ల, వ్యాసాపురం, రాయంపల్లి, రేణుమాకులపల్లి, నింబగల్లు గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి
పయ్యావుల కేశవ్‌ను గజమాలతో సత్కరిస్తున్న నాయకులు

ఉరవకొండ, ఏప్రిల్‌ 28: సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రజల్లోకి సూపర్‌స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. మండలంలోని బూదగవి, నెరమెట్ల, వ్యాసాపురం, రాయంపల్లి, రేణుమాకులపల్లి, నింబగల్లు గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బూదగవి గ్రామం రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ వైసీపీ మేనిఫేస్టోపై క్షేత్రస్థాయిలో ఆ పార్టీ కేడర్‌లో నిరాశ నెలకొందన్నారు. వైసీపీ మేనిపేస్టోతో ఆ పార్టీ గ్రాఫ్‌ మరింత దిగజారిపోయిందన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రశ్నించిన టీడీపీ నాయకులపై అక్రమకేసులు బనాయించారన్నారు. అరాచకపాలనకు రోజులు దగ్గరపడ్డాయన్నారు.


కేంద్ర ప్రభుత్వ నిధులతో జగన వైసీసీ బొమ్మలు వేసుకుని ప్రచారం చేసుకున్నారన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో 9 సార్లు నిత్యవసర ధరలు పెరిగాయన్నారు. ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి, కేంద్రానికి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని విమర్శించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏమి అభివృద్ధి చేశారో విశ్వేశ్వరరెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. చేతకాని అసమర్థ నాయకుడిని ఎన్నుకుంటే కష్టాలు తప్పవన్నారు. టీడీపీ హయాంలో 11 చెరువులకు నీళ్లిచ్చామన్నారు. ఈ ఐదేళ్లలో మీటరు కాలువైనా తవ్వారా అని ప్రశ్నించారు. తాగునీటి సమస్యలకు మాజీ ఎమ్మెల్యేనే కారణమన్నారు. మండల కన్వీనర్‌ విజయ్‌భాస్కర్‌, మాజీ ఎంపీపీ కుళ్లాయప్ప, ఏఎంసీ మాజీ చైర్మన్లు దేవినేని పురుషోత్తం, రేగాటి నాగరాజు, నాయకులు చిరంజీవి, వ్యాసాపురం సర్పంచ సీతారాములు, శ్రీధర్‌రెడ్డి, వన్నారెడ్డి, నెట్టెంసుధాకర్‌, సిద్ధప్ప, ప్రహ్లాద, భగవానదా్‌స పాల్గొన్నారు.


టీడీపీ మేనిఫెస్టోపై ప్రచారం

బెళుగుప్ప: టీడీపీ మేని ఫెస్టోపై ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ తనయుడు విజయసింహ ఆదివారం గంగవరం గ్రామంలో ప్రచా రం చేశారు. ఇంటింటికి వెళ్లి భవిష్యత్తు గ్యారెంటీ గురించి వివరించారు. రెండు గ్రామా ల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సైకిల్‌ గుర్తుకు ఓటేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వన్నూరుస్వామి, పెద్దతిప్పయ్య, మల్లికార్జున, కంచిరాముడు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 29 , 2024 | 12:09 AM