ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

JNTU: అధ్యాపకులు నిత్య పరిశోధకులు

ABN, Publish Date - Aug 28 , 2024 | 11:39 PM

అధ్యాపకులు నిత్య పరిశోధకులుగా కొత్త అంశాలను ఎప్పటికప్పుడు శోధించాలని జేఎనటీయూ ఇనచార్జి వీసీ ప్రొఫెసర్‌ సుదర్శన రావు సూచించారు. బుధవారం జేఎనటీయూ ఇంజనీరింగ్‌ కళాశాల మెకానికల్‌ సెమినార్‌ హాల్లో ఫ్యాకల్టీ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రాం(ఎ్‌ఫడీపీ) నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ చెన్నారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఎఫ్‌డీపీకి వీసీ సుదర్శనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Speaking VC Sudarshana Rao

అనంతపురం సెంట్రల్‌, ఆగస్టు 28: అధ్యాపకులు నిత్య పరిశోధకులుగా కొత్త అంశాలను ఎప్పటికప్పుడు శోధించాలని జేఎనటీయూ ఇనచార్జి వీసీ ప్రొఫెసర్‌ సుదర్శన రావు సూచించారు. బుధవారం జేఎనటీయూ ఇంజనీరింగ్‌ కళాశాల మెకానికల్‌ సెమినార్‌ హాల్లో ఫ్యాకల్టీ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రాం(ఎ్‌ఫడీపీ) నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ చెన్నారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఎఫ్‌డీపీకి వీసీ సుదర్శనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సాంకేతిక విద్యావ్యవస్థలో టీచింగ్‌ ఫ్యాకల్టీ కీలకమన్నారు. వారి విజ్ఞానాన్ని, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు బోధించి నూతన ఇంజనీర్లుగా తీర్చిదిద్దేలా అప్‌డేట్‌ కావాలని సూచించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ వసుంధర, ఎఫ్‌డీపీ డైరెక్టర్‌ ప్రశాంతి, డీఈ నాగప్రసాద్‌ నాయుడు, ప్రొఫెసర్‌లు దుర్గాప్రసాద్‌, చంద్రమోహనరెడ్డి, శివకుమార్‌, హేమచంద్రారెడ్డి, విభాగాధిపతులు అజిత, రామశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

విద్యార్థుల నైపుణ్యాలు వెలికితీసేలా ప్రత్యేక క్లబ్‌లు: విద్యార్థుల్లో దాగివున్న నైపుణ్యాలు వెలికితీసేందుకు ప్రత్యేక క్లబ్‌లు ఏర్పాటుచేశామని జేఎనటీయూ ఇనచార్జ్‌ వీసీ ప్రొఫెసర్‌ సుదర్శన రావు అన్నారు. జేఎనటీయూ ఇంజనీరింగ్‌ కళాశాల ఆడిటోరియంలో బుధవారం స్టూడెంట్‌ క్లబ్‌ సావనీర్‌ ఆవిష్కరణ సభను నిర్వహించారు. కోఆర్డినేటర్‌ డాక్టర్‌ మంజుల అధ్యక్షతన నిర్వహించిన సభను వీసీ, రిజిస్ర్టార్‌ క్రిష్ణయ్య, ప్రిన్సిపాల్‌ చెన్నారెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ వసుంధర జ్యోతిప్రజ్వలనచేసి ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ కమ్యునికేషన, ఇన్నోవేటివ్‌, టెక్నికల్‌, సాఫ్ట్‌, కోడింగ్‌, వెల్‌నెస్‌, లీడర్‌షిప్‌, ఫొటోగ్రఫీ తదితర అంశాలపై 12రకాల క్లబ్‌ల ద్వారా వాటిపై శిక్షణ ఇస్తారన్నారు.

Updated Date - Aug 28 , 2024 | 11:39 PM

Advertising
Advertising