ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hundred Years : ఆ ఇంట.. నూరేళ్ల పండుగ

ABN, Publish Date - Sep 20 , 2024 | 12:08 AM

కళ్యాణదుర్గం మండలం బోయలపల్లికి చెందిన నల్లబోతుల హనుమంతప్ప నిండు నూరేళ్ల జీవితం పూర్తి చేసుకున్నారు. కొడుకులు, కూతుళ్లు, మనవళ్లు, మనవరాండ్రు, ముని మనవళ్లు, ముని మనవరాండ్రు, వారి జీవిత భాగస్వాములు.. ఇలా సుమారు 50 మంది కుటుంబ సభ్యుల సమక్షంలో గురువారం 101వ పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. హనుమంతప్పకు ముగ్గురు ...

Hanumanthappa celebrating his birthday

కళ్యాణదుర్గం మండలం బోయలపల్లికి చెందిన నల్లబోతుల హనుమంతప్ప నిండు నూరేళ్ల జీవితం పూర్తి చేసుకున్నారు. కొడుకులు, కూతుళ్లు, మనవళ్లు, మనవరాండ్రు, ముని మనవళ్లు, ముని మనవరాండ్రు, వారి జీవిత భాగస్వాములు.. ఇలా సుమారు 50 మంది కుటుంబ సభ్యుల సమక్షంలో గురువారం 101వ పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. హనుమంతప్పకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. ఒక్కొక్కరికి ఇద్దరు చొప్పున సంతానం. అంటే.. మొత్తం పది మంది మనవళ్లు, మనవరాండ్రు. వీరికి పెళ్లిళ్లయాయ్యి. వీరి పిల్లల్లో కొందరికి కూడా పెళ్లిళ్లయ్యాయి. ఇప్పటికి తన


సంతతిలో మూడు తరాలను చూసిన ఆయన.. తన తండ్రి, తాతలతో కలిపి ఐదారు తరాలను చూసినట్లు. ప్రకృతి సహకరిస్తే.. ఇంకోతరాన్ని చూసేందుకూ ఆయన సిద్ధంగా ఉన్నారు. రక్త సంబంధీకులందరూ కలిసి ఆయనకు అరుదైన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. హనుమంతప్ప భార్య పదేళ్ల క్రితం కన్నుమూశారు. ఇప్పటికీ ఆయన నడవగలరని, ఆహారం కొద్దిగా మాత్రమే తీసుకుంటారని కుటుంబ సభ్యులు తెలిపారు. -కళ్యాణదుర్గం


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 20 , 2024 | 12:08 AM