ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pinchans : తొలిరోజే పండుగ

ABN, Publish Date - Aug 02 , 2024 | 12:54 AM

సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ జిల్లాలో తొలిరోజే 98 శాతం పూర్తి అయింది. గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులు గురువారం ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. కలెక్టరేట్‌ ఎనఐసీ నుంచి డీఆర్‌డీఏ-వెలుగు పీడీ ఓబులమ్మ, ఏపీడీ ఈశ్వరయ్య నేతృత్వంలో 41 మంది ఉద్యోగులు పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా 663 సచివాలయాల పరిధిలో 5,685 మంది సిబ్బంది, ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, ప్రజాప్రతినిధుల సమక్షంలో పింఛన్లను పంపిణీ చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. కలెక్టర్‌ డాక్టర్‌ ...

Minister Payyavula Keshav distributing Pinchans

పింఛన్ల పంపిణీ 98 శాతం పూర్తి.. పర్యవేక్షించిన కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌

అనంతపురం క్లాక్‌టవర్‌ /కూడేరు, ఆగస్టు 1: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ జిల్లాలో తొలిరోజే 98 శాతం పూర్తి అయింది. గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులు గురువారం ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. కలెక్టరేట్‌ ఎనఐసీ నుంచి డీఆర్‌డీఏ-వెలుగు పీడీ ఓబులమ్మ, ఏపీడీ ఈశ్వరయ్య నేతృత్వంలో 41 మంది ఉద్యోగులు పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా 663 సచివాలయాల పరిధిలో 5,685 మంది సిబ్బంది, ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, ప్రజాప్రతినిధుల సమక్షంలో పింఛన్లను పంపిణీ చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ పింఛన్ల పంపిణీని పర్యవేక్షించారు. తపోవనంలో కలెక్టర్‌ స్వయంగా కొందరికి పింఛన్లను అందజేశారు.


కష్టమైనా.. మాట నిలబెట్టుకుంటాం: మంత్రి పయ్యావుల కేశవ్‌

రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఎంత కష్టమైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. కూడేరు మండలం అంతరగంగ గ్రామంలో గురువారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను కలెక్టర్‌తో కలసి పంపిణీ చేశారు. గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పండుగలా సాగుతోందని అన్నారు. అధికారుల ద్వారా ఇంటింటికీ పింఛన పంపిణీ సాధ్యం కాదని ఎన్నికల సమయంలో జగన చెప్పారని, కూటమి ప్రభుత్వంలో తొలిరోజే అధికారం యంత్రాంగం రెండు, మూడు గంటల్లో 90 శాతం పంపిణీ పూర్తి చేసి.. సాధ్యమని నిరూపించిందని అన్నారు. పింఛన్లతోపాటు ఉద్యోగుల జీతాలు, ఇతర అంశాలకూ అంతే ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. అంతకు మునుపు గ్రామంలో మంత్రి పయ్యావుల కేశవ్‌కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసులు రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరి, ఐ-టీడీపీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు సొంపల్లి శ్రీకాంత, మాజీ ఎంపీపీ బ్రహ్మయ్య, మాజీ జెడ్పీటీసీ రామచంద్ర, కూడేరు సర్పంచు లలితమ్మ, ఇప్పేరు సర్పంచు ఓబులేసు, ఎంపీడీఓ విజయలలిత, డీటీ విశ్వనాథ్‌, ఏపీఎం రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 02 , 2024 | 12:54 AM

Advertising
Advertising
<