MLA MS RAJU : అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం : ఎమ్మెల్యే
ABN, Publish Date - Sep 03 , 2024 | 12:10 AM
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచే స్తున్నామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నా రు. వారు సోమవారం మండలంలోని ఆర్ అనంతపురంలో బ్లాక్ ప్లాం టేషన కింద చేపట్టిన మొక్కలు నాటే కార్యక్ర మంలో పాల్గొన్నారు. అనంతరం బుళ్ళస ముద్రం గ్రామంలో జనసేన నాయకు లు ఏర్పాటుచేసిన ఉపముఖ్యమంత్రి పవన కళ్యాణ్ జన్మదిన రోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్‌చేశారు.
మడకశిర రూరల్, సెప్టెంబరు 2 : అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచే స్తున్నామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నా రు. వారు సోమవారం మండలంలోని ఆర్ అనంతపురంలో బ్లాక్ ప్లాం టేషన కింద చేపట్టిన మొక్కలు నాటే కార్యక్ర మంలో పాల్గొన్నారు. అనంతరం బుళ్ళస ముద్రం గ్రామంలో జనసేన నాయకు లు ఏర్పాటుచేసిన ఉపముఖ్యమంత్రి పవన కళ్యాణ్ జన్మదిన రోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్‌చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మా ట్లాడుతూ ... నియోజకవర్గం అభి వృద్ధి లో భాగంగా అర్ అనంతపురం వద్ద ఎలె కా్ట్రనిక్ పరిశ్రమల కోసం 1650 ఎకరాల భూములు సేకరించామని తెలిపారు.
అ లాగే మడకశిరకు బైపాస్ కెనాల్, రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్ర బాబు అనుమతించా రన్నారు. మడకశిర మండలానికి అతి పెద్డ సోలార్ ప్రాజెక్ట్ రానుందని, అందుకోసం 6300 ఎకరాల భూముల సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రైతులందరూ సహకరించా లని కోరారు. అర్హులైన వారికి పింఛన్లు, ఇళ్లు మంజూరుచేస్తామన్నారు.
టీడీపీలోకి పలువురి చేరిక : మండలంలోని బుళ్ళసముద్రం, ఆర్ అనంతపురం పంచాయతీ ల్లోని వైసీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువు రు నాయకులు, కార్యకర్తలు సోమవారం టీడీపీలోకి చేరారు. బుళ్ళసముద్రంలో వైసీపీ నుంచి వంద కుటుంబాలు, ఆర్ అనంతపు రం నుంచి అనేక మంది టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, గుండుమల తిప్పేస్వామి వారికి టీడీపీ కండువా వేసి ఆహ్వానించా రు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కా ర్యదర్శి శ్రీనివామూర్తి, మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచు జైపాల్, నాగేంద్ర, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
అత్యధికులు ఉద్యోగాలు సాధించాలి
మడకశిరటౌన : మడకశిర లాంటి వెనకబడిన ప్రాంతాల్లో సైతం అత్యధిక మంది ఉపాధ్యాయ పోస్టులు పొందాలన్న లక్ష్యంతోనే డీఎస్సీ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. పట్టణంలోని డిగ్రీ కళాశాలలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన డీఎస్సీ కోచింగ్ సెంటర్‌ను ఆయన సోమవారం సందర్శించారు. అభ్యర్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు సంతృప్తిని వ్యక్తం చేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 03 , 2024 | 12:10 AM