MLA SUNITA : ప్రభుత్వం త్వరలో నష్టపరిహారం ఇస్తుంది
ABN, Publish Date - Oct 24 , 2024 | 12:02 AM
పూర్తిస్థాయిలో నష్టపో యిన కుటుంబాలను అచనావేసి త్వరలో ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటిస్తుంద ని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ క్రమంలో బుధవారం వా రికి అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా నిత్యవసరాలు పంపిణీ చేపట్టింది.
ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం రూరల్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పూర్తిస్థాయిలో నష్టపో యిన కుటుంబాలను అచనావేసి త్వరలో ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటిస్తుంద ని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ క్రమంలో బుధవారం వా రికి అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా నిత్యవసరాలు పంపిణీ చేపట్టింది. కలెక్టర్ వినోద్‌కుమార్, జేసీ శివ్‌నారాయణ్ శర్మ, ఆర్డీఓ వసంత బాబు, ఎమ్మెల్యే పరిటాల సునీత చేతుల మీదుగా సరుకులకు బాధి త కుటుంబాలకు పంపిణీ చేశారు. ఒక వైపు వర్షం కురుస్తున్నా..అందులోనే బాధిత 350 కు టుంబాలకు సాయాన్ని పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఇది తక్షణసాయంగా బాధిత కుటుంబాలకు అందిస్తున్నామన్నారు. పూర్తిస్థా యిలో నష్టపోయిన కుటుంబాలను అచనావేసి త్వర లో ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటిస్తుందన్నారు. కా ర్యక్రమంలో డీఎల్‌పీఓ సుమన జయంతి, డీఎల్‌డీఓ లలితబాయి, తహసీల్దార్ మోహనకుమార్, రీసర్వే డిప్యూటి తహసీల్దార్ మంజునాథ్, ఎంపీడీఓ దివాకర్, ఈఓఆర్డీ వెంకటనాయుడు, వీర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, టీడీపీ మండల కన్వీనర్ జింకా సూర్యనారాయణ, మాజీ కన్వీనర్ లక్షీత్మనారాయణ, క్లస్టర్ ఇనచార్జ్ రాగేమురళి తదితరులు పాల్గొన్నారు.
పంట నష్టాన్ని అంచనా వేయండి
రాప్తాడు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల వలన జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. మండలంలోని బండమీదపల్లి చెరువును బుదవారం ఎమ్మెల్యే పరిశీలించారు. చెరువు కింద ముంపునకు గురైన వరి, చీనీ పంటలు, కోతకు గురైన పంట పొలాలను పరిశీలించారు. బాధిత రైతులను కలిసి వారి కష్టాలను విన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేలాది ఎకరాలు నీట మునిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడికి ఫోన చేసి రైతులు నష్టపోయిన విషయాన్ని వివరించామన్నారు. ఒకసారి జిల్లాకు వచ్చి పరిశీలించమని తెలుపగా మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. చెరువు లు, కాలువలు తెగిపోయిన అంశాలను జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడి దృష్టికి తీసుకెళ్లగా, వాటి మరమ్మతులకు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. మొత్తం పంట నష్ట వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసు కెళ్తామన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఏపిఎంఐపీ పీడీ రఘునాథ్‌రెడ్డి, ఉద్యానశాఖ అధికారి నరసింహరావు, ఉద్యానశాఖ అధికారి రత్నకుమార్, వ్యవసాయ అధికారి శేఖర్‌రెడ్డి, మండల కన్వీనర్ కొండప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, రైతులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Oct 24 , 2024 | 12:02 AM