ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

City Roads : హైవే.. కంపు కంపు..!

ABN, Publish Date - Aug 22 , 2024 | 12:32 AM

ఫొటోను చూసి వాగులో వంకలో అనుకోకండి. ఇదంతా అనంతపురం నగర శివారులో.. జాతీయ రహదారి పక్కన డ్రైనేజీ నీరు. భారీ వర్షాలకు ఎటు వెళ్లాలో తెలియక.. బెంగుళూరు-హైదరాబాదు 44వ నంబరు జాతీయ రహదారి సర్వీసు రోడ్లను ముంచెత్తింది. కక్కలపల్లి క్రాస్‌లోని ఈ మురుగునీటి సమస్యకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందో తెలియదు. వర్షం కురిసిందంటే ఈ దారిలో వెళ్లేవారికి ...

Dilemma of motorists

ఫొటోను చూసి వాగులో వంకలో అనుకోకండి. ఇదంతా అనంతపురం నగర శివారులో.. జాతీయ రహదారి పక్కన డ్రైనేజీ నీరు. భారీ వర్షాలకు ఎటు వెళ్లాలో తెలియక.. బెంగుళూరు-హైదరాబాదు 44వ నంబరు జాతీయ రహదారి సర్వీసు రోడ్లను ముంచెత్తింది. కక్కలపల్లి క్రాస్‌లోని ఈ మురుగునీటి సమస్యకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందో తెలియదు. వర్షం కురిసిందంటే ఈ దారిలో వెళ్లేవారికి నరకం కనిపిస్తుంది. కక్కలపల్లి క్రాస్‌లో ఉన్న ఓ ఫంక్షన హాల్‌ పక్కన డ్రైనేజీ కాలువ ఉండేదీ. కాలువను ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. వర్షపునీరు


ప్రవహించేందుకు ఏర్పాటు చేసిన మోరీని మట్టితో పూడ్చేశారు. ఈ దారి రుద్రంపేట-కక్కలపల్లి పంచాయతీలకు మధ్యలో ఉండటంతో సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కక్కలపల్లి టమోటా మార్కెట్‌ ప్రాంతం సైతం వర్షపు నీటితో నిండిపోయింది. ఆ మార్గంలో ప్రయాణించే గ్రామీణ ప్రజలు, కాలనీలవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యంత్రాలతో తాత్కాలికంగా బుధవారం కాలువను తవ్వారు. ఇంకో వర్షం వస్తే అదే మట్టితో అది పూడిపోతుంది. శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. - అనంతపురం రూరల్‌


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 22 , 2024 | 12:32 AM

Advertising
Advertising
<